Sharada Peetham Lands : ప్రజావ్యతిరేక నిర్ణయాలతో పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి మరోసారి వెనకడుగు వేశారు. కోకాపేటలోని శారద పీఠం భూముల (Sharada Peetham Lands) విషయమై రేవంత్ వెనక్కి తగ్గారు. ఈ భూములను జలమండలికి కేటాయిస్తూ, పీఠం భవనాన్ని కూల్చివేయడానికి అధికారులు ప్రయత్నించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. పేదల ఇళ్లనే కాదు గుళ్లు, మఠాలను కాంగ్రెస్ ప్రభుత్వం వదలడం లేదని హరీశ్ రావు నిలదీయడంతో సీఎం రేవంత్ యూ టర్న్ తీసుకున్నారు.
కోకాపేటలో శారద పీఠానికి కేటాయించిన భూముల జోలికి వెళ్లొద్దని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవ్వడంతో రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జలమడలికి శారదా పీఠం భూముల కేటాయింపును రద్దు చేశారు. శనివారం శారదా పీఠం భూముల్లో జలమండలి పనులను ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో.. మంత్రి శ్రీధర్ బాబును కలిసి నిర్మాణాలపై వివరించాలని ఆయన శారద పీఠం ప్రతినిధులకు సూచించారు.
బ్రేకింగ్ న్యూస్
శారదా పీఠం భూముల విషయంలో వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి
కోకాపేటలోని శారద పీఠం భూములను జలమండలికి కేటాయిస్తూ, పీఠం భవనాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించిన అధికారులు
మాజీ మంత్రి హరీష్ రావు నిలదీయడంతో, వెనక్కి తగ్గి భూములను యధావిధిగా శారద పీఠానికే కొనసాగించాలని… https://t.co/HStyRVsIdP pic.twitter.com/JFn9Nb03Ru
— Telugu Scribe (@TeluguScribe) February 28, 2026