Bhagirath Choudhary | సబ్సిడీ పొందిన వ్యవసాయ శాఖ సహాయ మంత్రి.. తిరిగి చెల్లించినట్లు కేంద్రం వెల్లడి
Bhagirath Choudhary | కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రితో పాటు బీజేపీ ఎంపీ ఒకరు, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ (ఎన్ఎహ్బీ) పథకం కింద ఆర్థిక సహాయం పొందారు. అయితే కేంద్ర మంత్రి మాత్రం ఆ సబ్సిడీని తిరిగి చెల్లించారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రితో పాటు బీజేపీ ఎంపీ ఒకరు, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ (ఎన్ఎహ్బీ) పథకం కింద ఆర్థిక సహాయం పొందారు. అయితే కేంద్ర మంత్రి మాత్రం ఆ సబ్సిడీని తిరిగి చెల్లించారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. (Bhagirath Choudhary) లోక్‌సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. గత ఐదేళ్లలో ఎన్‌హెచ్‌బీ పథకాల కింద అధికారంలో ఉన్న కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యుడు లేదా వారి కుటుంబ సభ్యులు సబ్సిడీని అందుకున్నారా? అని లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఒక ప్రశ్న అడిగారు.
కాగా, వ్యవసాయ శాఖ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ దీనికి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, బీజేపీ ఎంపీ లుంబా రామ్ తమ వ్యవసాయ క్షేత్రాల కోసం ఆర్థిక సహాయం పొందారని మంగళవారం పార్లమెంట్‌కు తెలియజేశారు. ‘రాజస్థాన్ సిరోహి ఎంపీ లుంబా రామ్ 2025లో, రాజస్థాన్ అజ్మీర్ ఎంపీ, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి 2026లో ఆర్థిక సహాయం పొందారు. అయితే ఈ పథకం కింద పొందిన సబ్సిడీని సంబంధిత బ్యాంకుకు తిరిగి చెల్లించినట్లు భగీరథ్ చౌదరి తెలియజేశారు. ఎన్‌హెచ్‌బీలో జమ కోసం సంబంధిత బ్యాంకుకు తగిన ఆదేశాలు జారీ చేశాం’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు ప్రభుత్వ అధికారులు లేదా వారి కుటుంబ సభ్యుల దరఖాస్తుల విషయంలో ప్రయోజనం పొందటం, లేదా వైదొలగడం గురించి ప్రస్తుత ఎన్‌హెచ్‌బీ పథకం మార్గదర్శకాలలో ఎలాంటి నిర్దిష్ట నిబంధన లేదని వ్యవసాయం మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ స్పష్టం చేశారు. అయితే పారదర్శకమైన బహుళ స్థాయి యంత్రాంగం ద్వారా దరఖాస్తుల ప్రాసెస్ జరుగుతుందని అందులో వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

