హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : లైసెన్స్డ్ సర్వేయర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ న్యాయమైన డిమాండ్ల నెరవేర్చాలని ఈ నెల 8న అసెంబ్లీని ముట్టడించినందుకు 125మందిపై ఎఫ్ఆర్ నమోదు చేయడంతోపాటు ఉద్యోగాల నుంచి తొలగించేందుకు రిమూవల్ నోటీసులు జారీ చేయడంపై సర్వేయర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమస్యల పరిషారం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తే కేసులు, ఉద్యోగాల నుంచి తొలగించేందుకు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వెంటనే నోటీసులను ఉపసంహరించుకొని, న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.