భోపాల్: తల్లికి పాలు పడలేదు. దీంతో పసి బాబుకు ప్యాకెట్ పాలు పడుతున్నారు. పాలు పలుచగా ఉండేందుకు కొంచెం నీరు కలిపారు. అయితే కలుషిత నీరు కలిపిన పాలు తాగడంతో పసి బాలుడు అనారోగ్యంతో మరణించాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ విషాద సంఘటన జరిగింది. భగీరత్‌పుర ప్రాంతంలో సునీల్ సాహు దంపతులు నివసిస్తున్నారు. కుమార్తె పుట్టిన పదేళ్లకు వారి పూజలు ఫలించాయి. జూలై 8న పండంటి బాబు జన్మించాడు. అయితే తల్లికి పాలు పడలేదు. ఈ నేపథ్యంలో ఆ పసి బాబుకు ప్యాకెట్ పాలు పడుతున్నారు.
కాగా, ప్యాకెట్ పాలు కాస్త పలచగా ఉండేందుకు అందులో నీరు కలిపారు. అయితే ఆ నీరు కలుషితమై విషపూరితంగా మారినట్లు వారు గ్రహించలేకపోయారు. ఆ పాలు తాగిన ఐదున్నర నెలల అవ్యాన్ ఆ తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. జ్వరంతో పాటు విరోచనాలు కావడంతో డాక్టర్‌కు చూపించారు.
మరోవైపు డిసెంబర్ 28 రాత్రికి ఆ పసి బాబు ఆరోగ్యం విషమించింది. డిసెంబర్ 29న సోమవారం ఉదయం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. దీంతో ఆ ఇంట విషాదం నెలకొన్నది. ఇండోర్‌లో కలుషిత నీటి కారణంగా మరణించిన వారి సంఖ్య 10కి చేరింది.
Also Read:
Parrots Die Of Food Poisoning | ఫుడ్ పాయిజనింగ్ వల్ల.. 200 చిలుకలు మృతి
Watch: మొబైల్ ఫోన్‌తో వ్యక్తిని స్కాన్ చేసిన పోలీస్.. బంగ్లాదేశీయుడో కాదో గుర్తిస్తుందని వెల్లడి