Burj Khalifa : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఆందోళనకరంగా మారుతోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసిర్‌జాదే మరణించారు. మరోవైపు అమెరికా సైన్యానికి ఆశ్రయమిస్తున్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ అయిన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాను అక్కడి ప్రభుత్వం ఖాళీ చేయించింది.
అందులో నివాసం ఉంటున్నవారిని సురక్షిత ప్రాంతానికి తరలించింది. దుబాయ్‌పై ఇరాన్ మిస్సైల్ దాడి చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేయించారు. ఇరాన్.. దుబాయ్, అబుదాబి, ఖతార్, రియాద్‌లపై దాడులకు దిగింది. అక్కడి అమెరికా సైనిక స్థావరాలపై మిస్సైల్స్‌తో దాడి చేసింది. దుబాయ్‌లోని రెసిడెన్షియల్ స్తావరాలపై ఇరాన్ జరిపిన దాడుల్లో ఒకరు మరణించినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దుబాయ్ ఎయిర్‌పోర్టును ప్రభుత్వం మూసివేసింది.
ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు అవసరమని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ప్రకటించాయి. దాడులు ఆపాలని, చర్చలు జరపాలని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేశాయి. అమెరికన్ బేస్ క్యాంప్‌పై ఇరాన్ ప్రయోగించిన ఒక క్షిపణిని నేలకూల్చినట్లు అమెరికా రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. సిరియాపై కూడా ఇరాన్ దాడి చేసినట్లు తెలుస్తోంది.