SL vs PAK : ప్రపంచకప్ సూపర్ 8 చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓపెనర్లు చితక్కొట్టారు. పల్లెకెలె స్టేడియంలో ఓపెనర్ ఫర్హాన్(100) విధ్వంసక శతకంతో చెలరేగిపోగా.. ఫఖర్ జమాన్(84) క్లాస్ హాఫ్ సెంచరీతో శ్రీలంక బౌలర్లను బెంబేలెత్తించాడు. తొలి వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పినీ ద్వయం భారీ స్కోర్‌కు బాటలు వేసింది. జమన్ ఔటయ్యాక పుంజుకున్న లంక.. వరుసగా వికెట్లతో పాక్‌ను 212కే కట్టడి చేసింది.
సెమీస్ బెర్తుపై కన్నేసిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు శుభారంభిచ్చారు. భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో ఓపెనర్ ఫర్హాన్(100) చెలరేగుతున్నాడు. చమీర వేసిన తొలి ఓవర్లోనే బౌండరీ రాబట్టాడు. మధుషనక ఓవర్లో రెచ్చిపోయిన అతడు.. 4, 6తో రెచ్చిపోయాడు. మరో ఎండ్‌లో ఫఖర్ జమాన్(23 నాటౌట్) సైతం దంచేస్తున్నాడు. శ్రీలంక కెప్టెన్ దసున్ శనకు చుక్కలు చూపిస్తూ.. వరుసగా రెండు ఫోర్లు బాదాడు. ఫర్హాన్ బౌండరీ కొట్టగా ఆ ఓవర్లో 13 రన్స్ పిండుకున్నారు. వీరిద్దరి విధ్వంసంతో పవర్ ప్లేలో పాక్ వికెట్ కోల్పోకుండా 64 రన్స్ చేసింది. పదో ఓవర్లోనే స్కోర్ వంద దాటింది.
SPECTACULAR CENTURY from Sahibzada Farhan 💯 pic.twitter.com/TviIrMepA6
— ESPNcricinfo (@ESPNcricinfo) February 28, 2026
అర్ధ శతకాల తర్వాత కూడా జోరు తగ్గించని ఈ ద్వయం దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపింది. క్రీజునంటుకొని రెచ్చిపోయిన వీరిని విడదీయలేక లంక బౌలర్లు తలలు పట్టుకున్నారు. ఎట్టకేలకు చమీర(1-48) తొలి బ్రే కిస్తూ జమాన్ణు వెనక్కి పంపాడు. కాసేపటికే క్వాజా నఫయ్(2) వెనుదిరగగా.. షాదాబ్(7) రనౌటయ్యాడు. శనక ఒకేఓవర్లో నవాజ్(0), సల్మాన్ అఘా(0) లను ఔట్ చేసినా.. సింగిల్‌తో ఫర్హాన్ ప్రపంచకప్‌లో రెండో సెంచరీ సాధించాడు. చివరి ఓవర్లో ఫర్హాన్, షాహీన్ అఫ్రిది(4), నసీం షా(1)లు పెవిలియన్ చేరగా పాక్ 8 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. భారీ స్కోర్ చేసినప్పటికీ శ్రీలంకను 147లోపు కట్టడిచేస్తేనే పాక్ సెమీస్ చేరే అవకాశముంది.