లక్నో: ఒక బాలుడు తెగిన గాలిపటం కోసం రైలు పట్టాలపైకి వెళ్లాడు. ఇంతలో గూడ్స్ రైలు వేగంగా దూసుకొచ్చింది. అక్కడ చిక్కుకున్న బాలుడు రైలు పట్టాల మధ్యలో పడుకున్నాడు. చిన్న గాయమైనా కాకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. (Train Pass Over Boy) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 31న సయ్యద్రాజ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన పదేళ్ల పియూష్ కేసరి తన స్నేహితులతో కలిసి గాలిపటం ఎగురవేశాడు. అది తెగడంతో దాని కోసం పరుగెత్తాడు. సయ్యద్రాజ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపైకి ఆ బాలుడు వెళ్లాడు.
కాగా, ఇంతలో ఒక గూడ్స్ రైలు వేగంగా దూసుకొచ్చింది. రైలు పట్టాల వద్ద ఉన్న పియూష్ కాలు చిక్కుకుపోవడంతో అక్కడే ఉండిపోయాడు. రైలును గమనించిన ఆ బాలుడు రైలు పట్టాల మధ్యలో పడుకున్నాడు. 40 గూడ్స్ వ్యాగన్లు ఉన్న ఆ రైలు 30 సెకన్లలో దూసుకెళ్లింది. అయితే అదృష్టవశాత్తు చిన్న గాయమైనా కాకుండా పియూష్ ప్రాణాలతో బయటపడ్డాడు.
మరోవైపు అక్కడున్న స్థానికులు ఇది చూసి షాక్ అయ్యారు. గూడ్స్ రైలు వెళ్లిన తర్వాత ప్రాణాలు రిస్క్ చేసిన పియూష్‌ను పట్టుకుని కొట్టారు. వారి బారి నుంచి తప్పించుకుని అతడు పారిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
…जाको राखे साइयां !
लड़के के ऊपर से गुजर गई ट्रेन
पतंग लूटने जा रहा था लड़का#CrimeNews #ZeeUPUK @shukladeepali15 @JpSharmaLive pic.twitter.com/9wWpaDQqui— Zee Uttar Pradesh Uttarakhand (@ZEEUPUK) January 1, 2026
Also Read:
Indore Toxic water kills baby | పాలలో నీరు కలిపి పసి బాలుడికి తాగించారు.. అనారోగ్యంతో మృతి
Man Beaten To Death | వివాహిత మహిళతో మాట్లాడినందుకు.. యువకుడిని కొట్టి చంపారు
Watch: మొబైల్ ఫోన్‌తో వ్యక్తిని స్కాన్ చేసిన పోలీస్.. బంగ్లాదేశీయుడో కాదో గుర్తిస్తుందని వెల్లడి