సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే ఎండలు మొదలై మధ్యాహ్నం 12గంటల నుంచి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.7డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20.5 డిగ్రీలు, గాలిలో తేమ 24 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.