Gautam Adani | అంబానీని దాటేసిన అదానీ.. దేశీయ శ్రీమంతుడి జాబితాలో తొలిస్థానం
దేశీయ శ్రీమంతుల జాబితాలో అదానీ తిరిగి తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నారు. గడిచిన ఏడాదికాలంలో తొలిస్థానంలో కొనసాగిన ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ప్రస్తుత సంవత్సరానికిగాను ఎం3ఎం హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2026 జాబితా విడుదలైంది. ఈ జాబితాలో రూ.9.23 లక్షల కోట్లు(96 బిలియన్ డాలర్లు) సంపదతో గౌతమ్ అదానీ తొలిస్థానంలో నిలిచారు. కిందటేడాది సంపదతో పోలిస్తే 13 శాతం ఎగబాకింది.
- దేశీయ శ్రీమంతుడి జాబితాలో తొలిస్థానం
- రూ.9.23 లక్షల కోట్ల సంపదతో ఫస్ట్ ప్లేస్
- ఎం3ఎం హురూన్ ఇండియా రిచ్ లిస్ట్‌లో వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: దేశీయ శ్రీమంతుల జాబితాలో అదానీ తిరిగి తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నారు. గడిచిన ఏడాదికాలంలో తొలిస్థానంలో కొనసాగిన ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ప్రస్తుత సంవత్సరానికిగాను ఎం3ఎం హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2026 జాబితా విడుదలైంది. ఈ జాబితాలో రూ.9.23 లక్షల కోట్లు(96 బిలియన్ డాలర్లు) సంపదతో గౌతమ్ అదానీ తొలిస్థానంలో నిలిచారు. కిందటేడాది సంపదతో పోలిస్తే 13 శాతం ఎగబాకింది.
ఇదే సమయంలో ముకేశ్ అంబానీ రూ.8.63 లక్షల కోట్లు(90 బిలియన్ డాలర్లు)తో రెండోస్థానంతో సరిపెట్టుకున్నారు. ముకేశ్ అండ్ ఫ్యామిలీ సంపద మాత్రం కిందటేడాదితో పోలిస్తే 10 శాతం తగ్గడం విశేషం. వీరి వ్యక్తిగత సంపద మధ్య వ్యత్యాసం రూ.59,400 కోట్లు. ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల మధ్య తొలిస్థానం దోబూచులాడుతున్నది. 2022లో అంబానీని దాటేసిన అదానీ..ఆ తర్వాత ఏడాదిలో రెండోస్థానానికి పరిమితమయ్యాయి. మళ్లీ 2024లో తొలిస్థానం, 2025లో రెండో స్థానానికి పడిపోయారు. మళ్లీ ఇప్పుడు తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నారు.
మూడోస్థానానికి మిట్టల్
- స్టీల్ టైకూన్‌గా ఉన్న అర్సెలార్ మిట్టల్ వ్యక్తిగత సందప రాకెట్ వేగంతో దూసుకుపోయింది. హురున్ విడుదల చేసిన నివేదికలో గతేడాది ఎనిమిదో స్థానంలో ఉన్న ఎల్ఎన్ మిట్టల్ ఈసారికిగాను ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నారు. గడిచిన ఏడాదికాలంలో ఆయన సంపద ఏకంగా 93 శాతం ఎగబాకి రూ.3.39 లక్షల కోట్లకు చేరుకున్నది.
- హురూన్ విడుదల చేసిన జాబితాలో రూ.1,000 కోట్ల కంటే అధిక సంపాదన కలిగినవారు 1,810 మంది ఉన్నారు.
- వీరి మొత్తం సంపద రూ.187.5 లక్షల కోట్లు(1.96 ట్రిలియన్ డాలర్లు). దేశ జీడీపీలో వీరి సంపద సగం కావడం విశేషం. గతేడాదితో పోలిస్తే 12.8 శాతం వృద్ధి
- ఐదేండ్ల క్రితం 237గా ఉన్న డాలర్ బిలియనీర్లు ఈసారి వీరి సంఖ్య 391కి పెరిగారు. గత ఏడాదికాలంలో అదనంగా 27 మంది చేరారు.
- ఈ జాబితాలో తొలిసారిగా క్వాంట మ్ కంప్యూటింగ్ ఎంటర్ప్రెన్యూర్ క్యూపీఐఏఐ అధినేత నాగేంద్ర నాగరాజ చోటు దక్కించుకున్నారు. ఆయన సంపద రూ.1,700 కోట్లు
- ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగాలకు చెందిన 23 మంది సంపన్నవర్గాలు ఈ జాబితాలో చోటు దక్కింది. వీరి మొత్తం సంపద రూ.85,200 కోట్లు
- ముంబై నుంచి అత్యధికంగా 465 మంది సంపన్న వర్గాలకు చోటు లభించగా, ఆ తర్వాత న్యూఢిల్లీ నుంచి 236 మంది, బెంగళూరు నుంచి 129 మందికి చోటు లభించింది.
- వ్యక్తిగత సంపద రూ.9,874 కోట్ల నుంచి రూ.10,362 కోట్లకు పెరిగింది.
- 23 ఏండ్ల అతి పిన్న వయస్కుడు కైవల్య వోహ్రా చోటు లభించింది. ఆయన కో-ఫౌండర్ 24 ఏండ్ల ఆదిత్ పాలిచా రెండో స్థానంలో నిలిచారు.
- దేశీయ శ్రీమంతుల జాబితాలో 131 మంది మహిళలకు చోటు దక్కింది.
తెలుగువారు వీరే
తెలుగు రాష్ర్టాల్లో శ్రీమంతులు అంతకంతకూ పెరుగుతున్నారు. దివీస్ ల్యాబ్ అధినేత మురళీ దివీస్ రూ.1.25 లక్షల కోట్ల సంపదతో టాప్-13వ స్థానంలో నిలిచారు. వీరితోపాటు మేఘా ఇంజినీరింగ్ అధినేతలు పీ పిచ్చిరెడ్డి(రూ.53,100 కోట్లు), పీవీ కృష్ణారెడ్డి(రూ.52,100 కోట్లు), కంట్రోల్ ఎస్ డాటా సెంటర్ అధినేత శ్రీధర్ పిన్నపురెడ్డి అండ్ ఫ్యామిలీ(రూ.46,100 కోట్లు), అరబిందో ఫార్మా చైర్మన్ పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి (రూ.39,900 కోట్లు), హెటిరో డ్రగ్గ్ అధినేత బీ పార్థసారథి రెడ్డి (రూ.39,400 కోట్లు) అధికంగా వ్యక్తిగత సంపద కలిగివున్నారని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

