RTA Offices | ఏజెంట్ల దందాకు చెక్..! ఆర్టీఏ ఆఫీసుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
ఆర్టీఏ కార్యాలయాల్లో సిబ్బంది అండతో ఏజెంట్ల ఆగడాలు పేట్రేగిపోతుండటంతో ఉన్నతాధికారులు సీసీ కెమెరాల నిఘాపై దృష్టి సారించారు. ఇటీవల ఏసీబీ సోదాల్లో బండ్లగూడ కార్యాలయంలో అంతా ఏజెంట్లే చక్రం తిప్పుతూ పనులకో రేటు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇష్టానుసారంగా జారీ చేయించడం, ఆర్సీ, లైసెన్స్ కార్డులు నేరుగా ఏజెంట్ల చేతుల్లోకి వెళ్లడం, ఇతర ఫిట్నెస్ పరీక్షలకు క్లియరెన్స్ ఇప్పించడం వంటి వాటిని ఏసీబీ అధికారులు గుర్తించారు.
- ఆర్టీఏ ఆఫీసుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
- కోడ్ లాంగ్వేజ్‌కు అడ్డుకట్ట
సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఆర్టీఏ కార్యాలయాల్లో సిబ్బంది అండతో ఏజెంట్ల ఆగడాలు పేట్రేగిపోతుండటంతో ఉన్నతాధికారులు సీసీ కెమెరాల నిఘాపై దృష్టి సారించారు. ఇటీవల ఏసీబీ సోదాల్లో బండ్లగూడ కార్యాలయంలో అంతా ఏజెంట్లే చక్రం తిప్పుతూ పనులకో రేటు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇష్టానుసారంగా జారీ చేయించడం, ఆర్సీ, లైసెన్స్ కార్డులు నేరుగా ఏజెంట్ల చేతుల్లోకి వెళ్లడం, ఇతర ఫిట్నెస్ పరీక్షలకు క్లియరెన్స్ ఇప్పించడం వంటి వాటిని ఏసీబీ అధికారులు గుర్తించారు.
గతంలోనే ఇలాంటి ఏజెంట్ల దందాను తుడిచిపెట్టేందుకు సీసీ కెమెరాలను అధిక సంఖ్యలో ఏర్పాటు చేయాలని రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తొలుత ఖైరతాబాద్‌లో 8 కెమెరాలను అదనంగా ఇన్స్టాల్ చేశారు. ఈ కెమెరాలతో ప్రైవేట్ వ్యక్తులు రావడం, ఒకే వ్యక్తి ఎన్ని సార్లు వచ్చారు? తదితర డేటాతో గుర్తించి చర్యలు తీసుకున్నారు. ఈ తరహా కెమెరాలను నగరంలోని అన్ని కార్యాలయాల్లో ఇన్స్టాల్ చేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇకపై అన్నీ ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తులెవ్వరినీ లోపలికి అనుమతించబోమని చెప్పారు. ఎవరి పేరుతో స్లాట్ బుక్ అవుతుందో.. వారినే లోనికి అనుమతిస్తామని చెప్పారు.
ప్రతీ ఆర్టీవో కార్యాలయంలో అదనంగా సీసీ కెమరాలు ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తున్నారు. ఎటువంటి కోడ్ లాంగ్వేజీ దరఖాస్తులపై ఉన్నా కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు. సాధారణంగా గ్రేటర్లో 12 రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. ఒక్క రోజుకు రిజిస్ట్రేషన్ల కోసం ఒక్కో కార్యాలయానికి 80 నుంచి 200 వరకు వాహనాలు వస్తుంటాయి. ఆర్సీ, లైసెన్స్ కార్డులు దళారుల చేతుల్లోకి వెళ్తున్నట్టు వాహనదారులు ఆరోపిస్తున్నారు. దళారుల చర్యలకు బ్రేకులు వేయాల్సిన కొందరు అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సీసీ కెమెరాలను అత్యధిక సంఖ్యలో ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి కదలికలపై నిఘా ఉంచాలని అధికారులు యోచిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

