Tirumala | తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మాజీ సీజేఐ ఎన్వీ రమణ
Tirumala | తిరుమల శ్రీవారిని ప్రముఖులు బుధవారం దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ స్వామివారి ని దర్శించుకున్నారు.
తిరుమల : తిరుమల ( Tirumala ) శ్రీవారిని ప్రముఖులు బుధవారం దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ( NV Ramana ) స్వామివారి ని దర్శించుకున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువతో సన్మానించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో బుధవారం 23 కంపార్టుమెంట్లలో దర్శనం కోసం వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. మంగళవారం స్వామివారిని 59,413 మంది భక్తులు దర్శించుకోగా 20,015 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ.4.50 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. 3.18 లక్షల లడ్డూలను విక్రయించామని, 1.68 లక్షల మందికి అన్నప్రసాదం అందించామని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మాజీ సీజేఐ ఎన్వీ రమణ
Septic Tank | బాచుపల్లి ఘటనను సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్
‘ఉప సర్పంచులు, వార్డు సభ్యుల హక్కుల సాధనకు పోరాటం’
‘చరిత్రలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష’
Dalimb Trailer | జీ5లో సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ ‘దాలింబ్’.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

