‘ఉప సర్పంచులు, వార్డు సభ్యుల హక్కుల సాధనకు పోరాటం’
ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు న్యాయంగా దక్కాల్సిన హక్కులను ప్రభుత్వం కల్పించాలని రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గాదే రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 27న కరీంనగర్ సర్కస్ గ్రౌండ్లో నిర్వహించనున్న...
– ఉప సర్పంచ్‌కు రూ.5 వేలు
– వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలి
– ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్
నల్లగొండ రూరల్, నవంబర్ 25 : ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు న్యాయంగా దక్కాల్సిన హక్కులను ప్రభుత్వం కల్పించాలని రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గాదే రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 27న కరీంనగర్ సర్కస్ గ్రౌండ్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ పోస్టర్‌ను బుధవారం నల్లగొండ పట్టణంలోని టీఎన్జీవో భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల శిలాఫలకాలపై ఉప సర్పంచులు, వార్డు సభ్యుల పేర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ఉప సర్పంచులపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే విధానాన్ని పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఉప సర్పంచులకు నెలకు రూ.5,000, వార్డు సభ్యులకు రూ.3,000 గౌరవ వేతనం చెల్లించాలని కోరారు.

Sub Sarpanches01
గతంలో సమిష్టి పోరాటంతో చెక్ పవర్‌ను కాపాడుకున్నామని, మిగిలిన హక్కుల సాధన కోసం కూడా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ బహిరంగ సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. అంతకుముందు గట్టుప్పల్ మండలం తెరట్టుపల్లి గ్రామ ఉప సర్పంచ్ ఇటీవల అకాల మరణం పొందడంతో, కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సాయం జిల్లా ఉప సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు మేకల కోటిరెడ్డి, అక్బర్ పాషా, బాకీ నరసింహ, రవీందర్, సుమలత పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉప సర్పంచులు, వార్డు సభ్యుల హక్కుల సాధనకు పోరాటం’
‘చరిత్రలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష’
Dalimb Trailer | జీ5లో సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ ‘దాలింబ్’.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్!
Green Water Tankers | గ్రీన్ వాటర్ ట్యాంకర్లు డ్రైనేజీ నీటి సరఫరా కోసమేనా..? ఈ వీడియో చూడండి
Varanasi | ‘వారణాసి’ రిలీజ్ డేట్ మారనుందా .. ఏప్రిల్ నుంచి ఆగస్టుకు వాయిదా అంటూ ప్రచారం
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

