Green Water Tankers | గ్రీన్ వాటర్ ట్యాంకర్లు డ్రైనేజీ నీటి సరఫరా కోసమేనా..? ఈ వీడియో చూడండి
Green Water Tankers | కాంగ్రెస్ సర్కార్ ఓ వైపు నీటి కొరత ఉందని, నీటి వినియోగంపై చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు చెబుతూ గ్రీన్ వాటర్ ట్యాంకర్ల పేరిట డ్రైనేజీ నీటిని సరఫరా చేస్తున్నట్టు తాజా వీడియో ఒకటి చెప్పకనే చెబుతోంది.
Green Water Tankers | హైదరాబాద్ నగరంలో తాగునీటి వృథాను తగ్గించేందుకు, మురుగు నీటి శుద్ధి (STP) కేంద్రాల నుంచి శుద్ది చేసిన నీటిని తాగేతర అవసరాలకు సరఫరా చేసేందుకు హైదరాబాద్ జలమండలి (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలను ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే.
అయితే కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ వాటర్ ట్యాంకర్ల పేరిట డ్రైనేజీ నీటిని సరఫరా చేస్తున్నట్టు తాజా వీడియో ఒకటి చెప్పకనే చెబుతోంది. ఓ వైపు నీటి కొరత ఉందని, నీటి వినియోగంపై చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు చెబుతూ గ్రీన్ వాటర్ ట్యాంకర్లను ప్రవేశపెట్టిన ప్రభుత్వం మరోవైపు ఇలా గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా నగరంలోని డ్రైనేజీల నుంచి నీటిని సేకరిస్తున్న దృశ్యాలను ఓ నెటిజన్ షేర్ చేశారు. నిర్మాణ పనుల కోసమైనా, చెట్లకు నీళ్లు పోసేందుకైనా సరే ఇలా డ్రైనేజీ నీరు వాడడం ఏంటని వీడియో చూసిన ప్రజలు వాపోతున్నారు.
హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్
గ్రీన్ వాటర్ ట్యాంకర్ల పేరిట డ్రైనేజీ నీటిని సరఫరా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
నీటి కొరత ఉంది, నీళ్లను పొదుపుగా వాడాలి అంటూ కన్స్ట్రక్షన్స్ కోసం గ్రీన్ వాటర్ ట్యాంకర్లను మాత్రమే వాడాలంటూ కొత్త నిబంధనలు
నీటి వినియోగంపై ఎంతో శ్రద్ధ వహిస్తున్నట్టు, నానా హంగామా చేస్తూ గొప్ప పథకం తీసుకొస్తున్నామని గ్రీన్ వాటర్ ట్యాంకర్లను ప్రవేశపెట్టిన ప్రభుత్వం
అయితే గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా నగరంలోని డ్రైనేజీల నుంచి నీటిని సేకరించి సరఫరా చేస్తున్నట్టు వీడియో బయటపెట్టిన నెటిజన్
కన్స్ట్రక్షన్స్ కోసమైనా, చెట్లకు నీళ్లు పోసేందుకైనా డ్రైనేజీ నీరు వాడడం ఏంటని వెల్లువెత్తుతున్న విమర్శలు
ఎంతో గొప్ప పని చేస్తున్నామని చెప్పి చివరకు డ్రైనేజీ నీటిని సరఫరా చేయడం ఏంటని మండిపడుతున్న ప్రజలు
Video credits – Santosh advocate
— Telugu Scribe (@TeluguScribe) November 25, 2026
Read Also :
సమాచార శాఖ కార్యాలయం కళాకారిణికి వేధింపులు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Green Water Tankers | గ్రీన్ వాటర్ ట్యాంకర్లు డ్రైనేజీ నీటి సరఫరా కోసమేనా..? ఈ వీడియో చూడండి
Varanasi | ‘వారణాసి’ రిలీజ్ డేట్ మారనుందా .. ఏప్రిల్ నుంచి ఆగస్టుకు వాయిదా అంటూ ప్రచారం
Eklavya | సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. ఏఐ నటుడితో లయన్స్‌గేట్ ప్లే ‘ఏకలవ్య’ వెబ్ సిరీస్!
North Karnataka | కొన్నేళ్లలో ప్రత్యేక రాష్ట్రంగా ఉత్తర కర్ణాటక: బీజేపీ ఎమ్మెల్యే
Flipkart | ఫ్లిప్‌కార్ట్ సీఈవో రాజీనామా..11 ఏండ్ల ప్రయాణానికి ముగింపు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

