North Karnataka | కొన్నేళ్లలో ప్రత్యేక రాష్ట్రంగా ఉత్తర కర్ణాటక: బీజేపీ ఎమ్మెల్యే
North Karnataka | కొన్నేళ్లలో ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రంగా మారవచ్చని బీజేపీ ఎమ్మెల్యే బాలకృష్ణ జార్కిహోళి తెలిపారు. రాబోయే ఐదు నుంచి పదేళ్లలో ఇది నిజం కావచ్చునని ఆయన అన్నారు. డిసెంబర్ 2న ఉత్తర కర్ణాటకలోని బెళగావిలో కర్ణాటక శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
బెంగళూరు: కొన్నేళ్లలో ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రంగా మారవచ్చని బీజేపీ ఎమ్మెల్యే బాలకృష్ణ జార్కిహోళి తెలిపారు. రాబోయే ఐదు నుంచి పదేళ్లలో ఇది నిజం కావచ్చునని ఆయన అన్నారు.
డిసెంబర్ 2న ఉత్తర కర్ణాటకలోని బెళగావిలో కర్ణాటక శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. (BJP MLA Balakrishna Jarkiholi) ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పట్టున్న బీజేపీకి చెందిన అరభావి ఎమ్మెల్యే బాలకృష్ణ జార్కిహోళి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతానికి ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో ‘సువర్ణ విధాన సౌధ’ను బెళగావిలో నిర్మించారని ఆయన తెలిపారు. అయితే ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరుగలేదని మాజీ మంత్రి అయిన ఆయన మీడియాతో అన్నారు.
కాగా, ప్రత్యేక ఉత్తర కర్ణాటక రాష్ట్రం కోసం మాజీ మంత్రి ఉమేష్ కత్తి చేసిన వాదనను బీజేపీ ఎమ్మెల్యే బాలకృష్ణ జార్కిహోళి సమర్థించారు. ‘కొన్నిసార్లు, అది మంచి ఆలోచన అని మాకు కూడా అనిపించేది. ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే, బెళగావి దాని రాజధాని అవుతుందని, ఈ ప్రాంతం అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తుందని ఆయన చెప్పేవారు. బహుశా మరో ఐదు లేదా పది ఏళ్లలో పరిస్థితులు ఆ దిశగా మారవచ్చు. ఇది ఖచ్చితంగా జరుగవచ్చు. అప్పుడు ఏమవుతుందో చూద్దాం’ అని ఆయన అన్నారు.
మరోవైపు కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు బెళగావిలో జరుగనున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. కర్ణాటక నుంచి బెళగావిని వేరు చేసి మహారాష్ట్రలో విలీనం చేయాలన్న దశాబ్దాల నాటి డిమాండ్‌ను మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎస్) మళ్లీ తెరపైకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఐదు నుంచి పదేళ్లలో బెళగావి రాజధానిగా ప్రత్యేక ఉత్తర కర్ణాటక రాష్ట్రం ఏర్పాటు కావచ్చని బీజేపీ ఎమ్మెల్యే బాలకృష్ణ జార్కిహోళి పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eklavya | సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. ఏఐ నటుడితో లయన్స్‌గేట్ ప్లే ‘ఏకలవ్య’ వెబ్ సిరీస్!
North Karnataka | కొన్నేళ్లలో ప్రత్యేక రాష్ట్రంగా ఉత్తర కర్ణాటక: బీజేపీ ఎమ్మెల్యే
Flipkart | ఫ్లిప్‌కార్ట్ సీఈవో రాజీనామా..11 ఏండ్ల ప్రయాణానికి ముగింపు
‘ప్రజలు గ్రామాభివృద్ధికి సహకరించాలి’
‘పశువుల ఆరోగ్యంపై రైతులు శ్రద్ధ వహించాలి’
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

