Septic Tank | బాచుపల్లి ఘటనను సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్
Bachupally septic tank | తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) బాచుపల్లి సెఫ్టిక్ ట్యాంక్ ప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.
Septic Tank | బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దీపక్ హారీక్ అపార్ట్మెంట్ డ్రైనేజీ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా హెచ్.ఆర్ ఇన్వెస్టిస్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ కెంపెనీకి చెందిన ముగ్గురు సుమన్(24), సురేష్(25), పవన్(25) అనే వ్యక్తులు మృతి చెందారని తెలిసిందే. కాగా తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.
ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రభుత్వ కార్యదర్శి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ నుంచి మానవ హక్కుల కమిషన్ వివరణాత్మక నివేదికలు కోరింది. అదేవిధంగా మృతుల కుటుంబాలకు అందించిన పరిహారం, ఆర్థిక సహాయం, సంక్షేమ చర్యల వివరాలను కూడా నివేదికలో పొందుపరిచి డిసెంబర్ 22, 2026లోగా సమర్పించాలని కమిషన్ సూచించింది.
తగిన భద్రతా చర్యలు, రక్షణ పరికరాలు లేకుండా కార్మికులతో ప్రమాదకర పనులు చేయించినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో కార్మికుల భద్రత, బాధ్యుల నిర్లక్ష్యంపై కమిషన్ విచారణ చేపట్టనున్నది.
Read Also :
సమాచార శాఖ కార్యాలయం కళాకారిణికి వేధింపులు
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Septic Tank | బాచుపల్లి ఘటనను సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్
‘ఉప సర్పంచులు, వార్డు సభ్యుల హక్కుల సాధనకు పోరాటం’
‘చరిత్రలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష’
Dalimb Trailer | జీ5లో సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ ‘దాలింబ్’.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్!
Green Water Tankers | గ్రీన్ వాటర్ ట్యాంకర్లు డ్రైనేజీ నీటి సరఫరా కోసమేనా..? ఈ వీడియో చూడండి
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

