Ala Venkateswar Reddy | కొడంగల్‌కు నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Ala Venkateswar Reddy | కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రైతాంగం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
మహబూబ్ నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రైతాంగం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateswar Reddy ) ఆరోపించారు. భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కోయిల్ సాగర్ మీద కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ ముందు నుంచే హెచ్చరిస్తున్నా స్థానిక ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి నిర్లక్ష్యంతో నేడు కొడంగల్ ( Kodangal ) కు నీటి తరలింపు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందని విమర్శించారు. కోయిల్ సాగర్ మీద భారం పడొద్దనే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మిషన్ భగీరథ కోసం జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు జీవో ఇచ్చామని గుర్తు చేశారు. కోయిల్ సాగర్ నిండాలని కరివెన రిజర్వాయర్ నుంచి కెనాల్ డిజైన్ చేశామని వివరించారు.
కొడంగల్ కి నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కు రైతుల మీద ప్రేమ ఉంటే ప్రాజెక్ట్ ముందుకు వెళ్లేది కాదని తెలిపారు. ప్రభుత్వ అసమర్థత వల్ల వర్షాకాలం పంటలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని ఆరోపించారు. కొడంగల్‌కు నీటి తరలింపును అడ్డుకుంటామని హెచ్చరించారు. మక్తల్ నారాయణ పేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నుంచి కొడంగల్‌కు తాగునీటి అవసరాలకు వాడుకోవాలని మాజీ ఎమ్మెల్యే సూచించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ala Venkateswar Reddy | కొడంగల్‌కు నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Srinivas Goud | ఆర్డీఎస్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ArjunKapoor | మలైకాతో బ్రేకప్.. అర్జున్ కపూర్, సాహిబా బాలి డేటింగ్ నిజమేనా? వైరల్ అవుతున్న ఫోటో!
Pujita Ponnada |వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాపై నటి పూజిత పొన్నాడ షాకింగ్ కామెంట్స్.. నన్ను మోసం చేశారంటూ ఆవేదన!
Tirumala | తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మాజీ సీజేఐ ఎన్వీ రమణ
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

