సుమోటోగా స్వీకరించిన ఎస్‌హెచ్చార్సీ
ఈ నెల 21న ఆదిలాబాద్ రిమ్స్(రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో జరిగిన అగ్నిప్రమాదంలో నవజాత శిశువుల మృతిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(ఎస్‌హెచ్చార్సీ) స్పందించింది. ఈ ఘటనపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనంపై స్పందించిన కమిషన్, కేసును సుమోటోగా స్వీకరించింది.
- రిమ్స్‌పై వైద్యారోగ్యశాఖ నుంచి నివేదిక కోరిన కమిషన్
సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 23 : ఈ నెల 21న ఆదిలాబాద్ రిమ్స్(రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో జరిగిన అగ్నిప్రమాదంలో నవజాత శిశువుల మృతిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(ఎస్‌హెచ్చార్సీ) స్పందించింది. ఈ ఘటనపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనంపై స్పందించిన కమిషన్, కేసును సుమోటోగా స్వీకరించింది.
ఘటనకు దారితీసిన వాస్తవ పరిస్థితులు, శిశువుల మృతికి కారణాలు, ఎస్‌ఎన్‌సీయూలో భద్రత, నిర్వహణ, ప్రమాద సమయంలో చేపట్టిన రక్షణ చర్యలు, ఘటనపై విచారణకు సంబంధించిన అంశాలను నిర్ధారించుకోవడం అవసరమని భావించిన కమిషన్, ఘటనకు సంబంధించిన సమగ్ర నివేదికను సమర్పించాలని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది.
అగ్నిప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ఎస్‌ఎన్‌సీయూలో భద్రత, నిర్వహణ, శిశువుల రక్షణ, చికిత్సకు తీసుకున్న చర్యలు, ఘటనపై నిర్వహించిన విచారణలో వెలువడిన అంశాలను నివేదికలో పొందుపర్చాలని కమిషన్ సూచించింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

