కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ మౌసమ్ నూర్ (Trinamool MP Mausam Noor) గుడ్ బై చెప్పారు. శనివారం కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు జైరామ్ రమేష్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్, పీసీసీ అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ సమక్షంలో మౌసమ్ నూర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ నేతలు ఆమెను కాంగ్రెస్‌లోకి తిరిగి స్వాగతించారు.
కాగా, 46 ఏళ్ల మౌసమ్ నూర్ 2009 నుంచి 2019 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున మాల్దా స్థానం నుంచి రెండుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత టీఎంసీలో చేరిన ఆమె రాజ్యసభకు ఎంపికయ్యారు.
మరోవైపు మౌసమ్ నూర్ రాజ్యసభ గడువు ఏప్రిల్‌తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఆమె తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. త్వరలో జరుగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున మాల్దా నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తున్నది.
Also Read:
Man Beaten Up | బంగ్లాదేశీయుడిగా అనుమానించి.. బీహార్ వ్యక్తిపై దాడి
Watch: పాముతో వ్యక్తి సంభాషణ.. వీడియో వైరల్