పాట్నా: ఒక వ్యక్తిని బంగ్లాదేశీయుడిగా స్థానికులు అనుమానించారు. అతడిని తీవ్రంగా కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Man Beaten Up) బీహార్లోని మధుబని జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాజ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్డా ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తి తాపీ పనిచేస్తున్నాడు. అయితే ఆ వ్యక్తి బంగ్లాదేశీయుడని స్థానికులు అనుమానించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు అతడిని దారుణంగా కొట్టారు. ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేశారు. సుపాల్ జిల్లాలోని బిర్పూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిని బంగ్లాదేశీయుడిగా అనుమానించి కొట్టినట్లు తెలుసుకున్నారు.
మరోవైపు ఆ వ్యక్తిపై దాడి చేసిన ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేయడంతోపాటు ఇలాంటి వీడియోలను వైరల్ చేసే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read:
Cross-Border Kidney Racket | రైతు వీడియో వైరల్.. సరిహద్దులు దాటిన కిడ్నీ రాకెట్ గుట్టురట్టు