TGIIC Lands | టార్గెట్ రూ.3,500 కోట్లు.. టీజీఐఐసీ భూముల వేలానికి సర్కార్ రెడీ
TGIIC Lands | రైతు భరోసాతోపాటు పలు ఇతర పథకాల అమలుకు నిధుల్లేక సతమతమవుతున్న రేవంత్‌రెడ్డి సర్కార్ మరోసారి ప్రభుత్వ భూముల విక్రయానికి సిద్ధమవుతున్నది.
TGIIC Lands | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రైతు భరోసాతోపాటు పలు ఇతర పథకాల అమలుకు నిధుల్లేక సతమతమవుతున్న రేవంత్‌రెడ్డి సర్కార్ మరోసారి ప్రభుత్వ భూముల విక్రయానికి సిద్ధమవుతున్నది. అందులో భాగంగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీజీఐఐసీ) ఆధ్వర్యంలోని భూములను విక్రయించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం ఉస్మాన్‌నగర్ గ్రామ సర్వే నంబర్ 30లోని 47.55 ఎకరాల్లో విస్తరించి ఉన్న మొత్తం 7 ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించి రూ.3,500 కోట్లు సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ నెల 10 నుంచి 3 విడతల్లో జరిగే ఈ వేలంలో ఆఫ్సెట్ ధరను ఎకరాకు రూ.39 కోట్లుగా నిర్ణయించారు.
ఈ భూములు మల్టీ యూజ్ జోన్లో ఉండటంతో కమర్షియల్, రెసిడెన్షియల్, రిటైల్, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, ఎంటర్టైన్మెంట్ తదితర అవసరాలకు ఉపయోగపడతాయి. దీంతో ఎకరా రూ.70-80 కోట్ల వరకు పలుకుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నంబర్ 1, 4 ప్లాట్లకు ఈ నెల 10న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే వేలంలో పాల్గొనాలనుకునేవారు 6వ తేదీలోగా, నంబర్ 2, 6, 9 ప్లాట్లకు 13న జరిగే వేలంలో పాల్గొనాలనుకునేవారు 11వ తేదీలోగా, నంబర్ 3, 7 ప్లాట్లకు 16వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని స్పష్టం చేసిన టీజీఐఐసీ.. కనీస బిడ్ ఇంక్రిమెంట్‌ను రూ.25 లక్షలుగా నిర్ణయించింది. వేలంలో ప్లాట్లు దక్కించుకున్నవారు వాయిదాల పద్ధతిలో 90 రోజుల్లోగా పూర్తి మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం మరో 90 రోజుల గడువు ఇస్తారు. కానీ, ఈ 90 రోజులకు 12% వార్షిక వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
సర్కార్ ఆశలు నెరవేరేనా?
రాష్ట్రంలో హైడ్రాను ఏర్పాటు చేసి జలాశయాల పరిరక్షణ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ సర్కార్ నిత్యం కూల్చివేతలు కొనసాగించడం, హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల్లో భారీగా భూసేకరణకు నోటిఫికేషన్లు జారీచేయడం, పలుచోట్ల భూములను నిషేధిత జాబితాలో చేర్చడం తదితర కారణాలతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. దీంతో అపార్ట్మెంట్లు, ప్లాట్ల అమ్మకాలు జరుగక రియల్టర్లు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీజీఐఐసీ భూముల వేలానికి ఏ మేరకు స్పందన వస్తుందన్న దానిపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

