Health Tips | ఉదయం లేవగానే కాఫీ, టీ కాదు నీళ్లు తాగండి.. ఎందుకంటే..!
Health Tips | చాలామందికి ఉదయం నిద్రలేవగానే టీ లేదా కాఫీ (Tea or Coffee) తాగే అలవాటు ఉంటుంది. అయితే ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం కంటే ఒక గ్లాసు నీళ్లు (Glass of Water) తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే నీళ్లు తాగడంవల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Health Tips : చాలామందికి ఉదయం నిద్రలేవగానే టీ లేదా కాఫీ (Tea or Coffee) తాగే అలవాటు ఉంటుంది. అయితే ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం కంటే ఒక గ్లాసు నీళ్లు (Glass of Water) తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే నీళ్లు తాగడంవల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరానికి తక్షణ శక్తి
రాత్రంతా నీళ్లు తాగకుండా ఉండటంవల్ల ఉదయం లేవగానే కొంత నీరసం లేదా అలసటగా అనిపించవచ్చు. నిద్రలేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగితే శరీరానికి తేమ అందడంతోపాటు ఉత్సాహంగా అనిపిస్తుంది.
జీర్ణశక్తి పెంపు
రోజూ ఉదయం నీరు తాగడంవల్ల జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేయడం ప్రారంభిస్తుంది. దాంతో ఆహారం సులభంగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది.
బరువు నియంత్రణ
ఖాళీ కడుపుతో నీరు తాగడంవల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దాంతో ఆహారం తక్కువగా తీసుకునేందుకు అవకాశముంటుంది. అలాగే శరీర జీవక్రియకు కూడా కొంత మేలు చేస్తుంది. అయితే బరువు తగ్గాలంటే ఆహార నియంత్రణ, వ్యాయామం కూడా తప్పనిసరి.
ఏకాగ్రత పెంపు
శరీరంలో తగినంత నీరు ఉంటే మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. దాంతో ఏకాగ్రత, చురుకుదనం పెరగడంలో సహాయపడుతుంది.
చర్మ ఆరోగ్యం
శరీరానికి సరిపడా నీరు అందితే చర్మం తేమను నిలుపుకుంటుంది. దాంతో చర్మం తాజాగా కనిపించడంలో సాయపడుతుంది.
తలనొప్పి నుంచి విముక్తి
కొన్నిసార్లు శరీరంలో నీటి కొరతవల్ల తలనొప్పి రావచ్చు. అలాంటి సందర్భాల్లో ఉదయం ఒక గ్లాసు నీరు తాగడం ఉపశమనాన్ని కలిగించవచ్చు. అయితే తరచూ తలనొప్పి వస్తే వైద్యులని సంప్రదించడం మంచిది.
ఎన్ని నీళ్లు తీసుకోవాలి..?
ఉదయం నిద్రలేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల సాధారణ నీళ్లు లేదంటే గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగాల్సిన అవసరం లేదు. అయితే కిడ్నీ, గుండె లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచన మేరకు నీటి పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

