‘కాకతీయ సేవా సమితి సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకం’
సామాజిక సేవా రంగాల్లో కోదాడ కాకతీయ సేవా సమితి అందిస్తున్న సేవలు భావితరాలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, జిల్లా పరిషత్ సీఈవో దేవరపల్లి శిరీష కొనియాడారు. గురువారం దుర్గాపురం సమీపంలోని...
– నిరుపేదలకు అంతర్జాతీయ స్థాయి కంటి వైద్యం అభినందనీయం….
– సూర్యాపేట జడ్పీ సీఈవో శిరీష
కోదాడ, నవంబర్ 19 : సామాజిక సేవా రంగాల్లో కోదాడ కాకతీయ సేవా సమితి అందిస్తున్న సేవలు భావితరాలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, జిల్లా పరిషత్ సీఈవో దేవరపల్లి శిరీష కొనియాడారు. గురువారం దుర్గాపురం సమీపంలోని కాకతీయ సేవా సమితి కల్యాణ మండపంలో గత పది రోజులుగా శంకర నేత్రాలయ పుట్టపర్తి వారి సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరం ముగింపు కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. నిరుపేదలకు సైతం అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన కంటి వైద్య సేవలు, శస్త్రచికిత్సలను ఉచితంగా అందించడం ఎంతో అభినందనీయమని ప్రశంసించారు. ఈ శిబిరంలో మొత్తం 650 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 140 మందికి విజయవంతంగా కంటి శుక్లాల ఆపరేషన్లు జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావిళ్ల సీతారామయ్య, కాకతీయ సేవా సమితి అధ్యక్షుడు పెదనాటి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వేమూరి సురేశ్, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, డాక్టర్ జాస్తి సుబ్బారావు, పోటు రంగారావు, కాకర్ల వెంకటేశ్వరరావు, గంట సత్యనారాయణ, కనగాల నాగేశ్వరరావు, నాదెళ్ల బాలకృష్ణ, మారుతి మాధవరావు, కొత్త రాంబాబు, ముండ్ర రవికుమార్, శంకర నేత్రాలయ వైద్య బృందం పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాకతీయ సేవా సమితి సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకం’
PM Modi | దేశం పేదరికాన్ని జయించింది.. ఫిక్కీ వార్షిక సమావేశంలో ప్రధాని మోదీ..!
Ram Pothineni | మెన్స్ డే స్పెషల్.. ‘RAPO23’ ప్రీ-లుక్ వైరల్!
‘పల్లె దవాఖానాలో ఎంబీబీఎస్ వైద్యుడిని ఏర్పాటు చేయాలి’
KTR | బీఆర్సోళ్లు ఎక్కడున్నరంటూ టార్చ్‌లైట్ వేసుకుని వస్తరు : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

