పోచంపల్లి బ్యాంక్‌కు జాతీయ అవార్డు
న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ కో-ఆపరేటివ్ సమ్మిట్ ఎక్స్‌లెన్స్ అవార్డు ప్రధానోత్సవంలో పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌కు జాతీయ అవార్డు లభించింది. పోచంపల్లి బ్యాంక్‌కు ఎక్స్‌లెన్స్ ఇన్ ఎన్పీఏ మేనేజ్మెంట్ అవార్డును నాబార్డ్ డైరెక్టర్, ఆర్బీఐ మాజీ డైరెక్టర్...
భూదాన్ పోచంపల్లి, నవంబర్ 19 : న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ కో-ఆపరేటివ్ సమ్మిట్ ఎక్స్‌లెన్స్ అవార్డు ప్రధానోత్సవంలో పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌కు జాతీయ అవార్డు లభించింది. పోచంపల్లి బ్యాంక్‌కు ఎక్స్‌లెన్స్ ఇన్ ఎన్పీఏ మేనేజ్మెంట్ అవార్డును నాబార్డ్ డైరెక్టర్, ఆర్బీఐ మాజీ డైరెక్టర్ సతీష్ మరాతే, ఎన్ ఎ ఎఫ్ సి యు బి చైర్మన్ లక్ష్మీదాస్ చేతుల మీదుగా గురువారం పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ తడక రమేశ్, బ్యాంక్ సీఈవో సీత శ్రీనివాస్ అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు జాతీయ బ్యాంకులకు ధీటుగా అధునాతనమైన సేవలను ఖాతాదారులకు అందిస్తున్నట్లు తెలిపారు.
బ్యాంకు ప్రస్తుత డిపాజిట్లు రూ.400.99 కోట్లు. మంజూరు చేసిన రుణాలు రూ.291.98 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించారు. ఖాతాదారులందరూ సైబర్ మోసాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. జాతీయస్థాయిలో ప్రతి సంవత్సరం అవార్డులను గెలుపొందడం పట్ల బ్యాంకు వైస్ చైర్మన్ భారత రాజేంద్రప్రసాద్, డైరెక్టర్లు కర్నాటి బాలసుబ్రమణ్యం, ఏలే హరి శంకర్, సురపల్లి రమేశ్, రాపోలు వేణు, గుండు కావ్య, కర్నాటి భార్గవి, బిట్టు భాస్కర్, మక్తాల నరసింహ, బ్యాంకు వ్యవస్థాపకులు, ఖాతాదారులు, వాటాదారులు, శ్రేయోభిలాషులు, బ్యాంక్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

