MLA Naini Rajender Reddy | మహిళలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని అనుచరుడి దాడి.. వీడియో
MLA Naini Rajender Reddy | ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అనుచరుడు, 30వ డివిజన్ కార్పొరేటర్ క్యాండిడేట్ అయిన బొంత సారంగపాణి పేదల స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా వారిపై దాడికి దిగిన వీడియో పేదలపై కాంగ్రెస్ నేతల దౌర్జన్యం ఎలా ఉందో కండ్లకు కట్టినట్టు చూపిస్తుంది.
MLA Naini Rajender Reddy | కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొంత సారంగపాణి వల్ల తమకు ప్రాణహాని ఉందని, తమ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే నాయిని అనుచరుడు మహిళలపై దాడి చేయడం కలకలం రేపుతోంది.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అనుచరుడు, 30వ డివిజన్ కార్పొరేటర్ క్యాండిడేట్ అయిన బొంత సారంగపాణి పేదల స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా వారిపై దాడికి దిగిన వీడియో పేదలపై కాంగ్రెస్ నేతల దౌర్జన్యం ఎలా ఉందో కండ్లకు కట్టినట్టు చూపిస్తుంది. భూకబ్జా వ్యవహారంపై నాయిని రాజేందర్ రెడ్డికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా సారంగపాణికే వత్తాసు పలికాడని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధితులు.. వరంగల్ నగరంలో పేదల ఇండ్లను కూల్చేసి ఎమ్మెల్యే నాయిని ఆ స్థలాలను కబ్జా చేస్తున్నాడని ఆరోపించారు.
ఇదిలా ఉంటే గతంలో నాయిని అనుచరులు హనుమకొండ నగర పరిధిలోని యాదవ నగర్, రెడ్డిపురం వద్ద ప్లాట్లను కబ్జా చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి.
మహిళలపై దారుణంగా దాడి చేసి కొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరుడు
పేదల స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా వారిపై దాడికి దిగిన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అనుచరుడు, 30వ డివిజన్ కార్పొరేటర్ క్యాoడిడేట్ బొంత సారంగపాణి
నాయిని రాజేందర్… https://t.co/yiX8sKCFx5 pic.twitter.com/G1aGH3TCj8
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2026
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

