KCR : వినాయక చవితి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఎర్రవెల్లి నివాసంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో కేసీఆర్, సతీమణి శోభ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ (KTR) కుమారుడు హిమాన్షు (Himanshu) కూడా హాజరయ్యారు. తాత, నానమ్మతో కలిసి అతడు కూడా పూజలో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) సతీ సమేతంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఎర్రవెల్లి నివాసంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో కేసీఆర్, సతీమణి శోభ పాల్గొన్నారు. మట్టి వినాయకుడికి పూజలు చేసి.. తెలంగాణ ప్రజానీకం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ (KTR) కుమారుడు హిమాన్షు (Himanshu) కూడా హాజరయ్యారు.
వినాయక చవితి పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించి, విజయాలను అందించే దైవంగా, వినాయకుణ్ణి హిందూ సమాజం కొలుచుకుంటుందని అన్నారు.

దైవ పూజలను, ధార్మిక క్రతువులు విఘ్నేశ్వరుని పూజతో ప్రారంభించడం ద్వారా హిందూ సంప్రదాయాల్లో గణనాయకునికి తొలి ప్రాధాన్యతనిస్తామని కేసీఆర్ తెలిపారు. వాడ వాడలా మండపాలు ఏర్పాటు చేసుకుని తొమ్మిది రోజుల పాటు గణేశ్ నవరాత్రులు జరుపుకుంటూ, పిల్లలు పెద్దలు అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయకునికి పూజలు నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం తిరిగి గాడినపడి, పాడి పంటలతో తెలంగాణ రైతు కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని కోరుతూ, ఏకదంతుడిని కేసీఆర్ ప్రార్థించారు.