IND vs AFG | మెరిసిన శాంసన్, నితీశ్.. టీ20 సిరీస్ టీమిండియా వశం..!
IND vs AFG : మూడు టీ20ల సిరీస్‌లో జోరు చూపిస్తున్న భారత్.. వరసగా రెండో మ్యాచ్‌లోనూ అఫ్గనిస్థాన్‌ను చిత్తు చేసింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో నితీశ్ రెడ్డి(3-35) బంతితో రాణించగా.. ఆపై ఓపెనర్లు అభిషేక్ శర్మ(39) సంజూ శాంసన్(57)లు దంచేశారు.
IND vs AFG : మూడు టీ20ల సిరీస్‌లో జోరు చూపిస్తున్న భారత్.. వరసగా రెండో మ్యాచ్‌లోనూ అఫ్గనిస్థాన్‌ను చిత్తు చేసింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో నితీశ్ రెడ్డి(3-35) బంతితో రాణించగా.. ఆపై ఓపెనర్లు అభిషేక్ శర్మ(39) సంజూ శాంసన్(57)లు దంచేశారు. అర్ధ శతకంతో విరుచుకుపడిన సంజూను రషీద్ ఖాన్ బోల్తా కొట్టించినా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ(15 నాటౌట్) సాయంతో ఇషాన్ కిషన్(38 నాటౌట్) లాంఛనం ముగించాడు. ఏడు వికెట్ల విజయంతో సిరీస్‌ను పట్టేసింది టీమిండియా.
ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్‌ల నుంచి తేరుకున్న టీమిండియా స్వదేశంలో గర్జించింది. అఫ్గనిస్థాన్‌పై వరసగా రెండు విజయాలతో టీ20ల సిరీస్‌ను గెలుచుకుంది భారత్. తొలి మ్యాచ్‌లో 7 వికెట్లతో నెగ్గిన అయ్యర్ సేన.. ఈసారి వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. 160 పరుగుల ఛేదనలో ఓపెనర్లు అభిషేక్ శర్మ(39), సంజూ శాంసన్(57) మెరుపు ఆరంభమిచ్చారు. రెండు ఓవర్లలోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 47 రన్స్ పిండుకుందీ ద్వయం.
4️⃣7️⃣ runs from 2⃣ overs to end the powerplay 😮
☝️ One word for that fiery batting display from Sanju Samson and Abhishek Sharma? 🫡
Updates ▶️ https://t.co/96e4nhbYLf#TeamIndia | #AFGvIND pic.twitter.com/A8OKGb0mCs
— BCCI (@BCCI) September 15, 2026
అభిషేక్ ఔటైనా.. తనమార్క్ షాట్లతో అలరించిన శాంసన్ అర్ధ శతకం బాదాడు. అయితే.. రషీద్ ఖాన్ ఓవర్లో సిక్సర్‌కు యత్నించి సంజూ బౌండరీ వద్దనబీ చేతికి చిక్కాడు. ఆ తర్వాతి రషీద్ ఓవర్లోనే శ్రేయాస్ అయ్యర్(11)ను డైవింగ్ స్లిప్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు. వెంట వెంటనే రెండు వికెట్లు పడినా.. ఇషాన్ కిషన్(38 నాటౌట్) ఒత్తిడికి లోనవ్వలేదు. అప్పటికే విజయం ఖరారు కాగా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ(15 నాటౌట్)తో కలిసి లాంఛనం పూర్తి చేశాడు ఇషాన్. 15వ ఓవర్లో బౌండరీతో జట్టును గెలిపించాడీ చిచ్చరపిడుగు. 7 వికెట్లతో జయభేరి మోగించిన్ మెన్ ఇన్ బ్లూ మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ పట్టేసింది. నామమాత్రమైన మూడో టీ20 సెప్టెంబర్ 17న జరుగనుంది.
నబీ, రషీద్ ధనాధన్
టాస్ ఓడిన అఫ్గనిస్థాన్‌కు మొదటి ఓవర్లోనే షాకిచ్చాడు అర్ష్‌దీప్ సింగ్. తొలి మ్యాచ్‌లో డకౌటైన ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(0)ను అతడు సున్నాకే పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత నితీశ్ రెడ్డి(3-35) ఓవర్లో కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్(37)పెద్ద షాట్ ఆడి రవి బిష్ణోయ్ చేతికి చిక్కాడు. ధాటిగా ఆడుతున్న సెడీకుల్లా అటల్(12)ను రవి బిష్ణోయ్ ఔట్ చేయగా.. గుల్బదిన్(10), డార్విష్ రసూలీ(26)లు విఫలమయ్యారు.
Innings Break!
Clinical effort from #TeamIndia on the field 👏👏
Over to our batters to seal the series 🙌
Scorecard ▶️ https://t.co/96e4nhbYLf#AFGvIND pic.twitter.com/sKJbuY3x3F
— BCCI (@BCCI) September 15, 2026
గత మ్యాచ్‌లో యాభై కొట్టిన అజ్మతుల్లా ఒమర్జాయ్(11)ను అక్షర్ వెనక్కి పంపాడు. అయితే.. మాజీ కెప్టెన్లు మొహమ్మద్ నబీ(20), రషీద్ ఖాన్(28)లు బాధ్యతగా ఆడారు. వీరిద్దరి పోరాటంతో కాబూలీ టీమ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగలిగింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

