ECB | కొత్త కలయికలో ఇంగ్లండ్‌కు తొలి పరీక్ష.. పోప్, లారెన్స్‌కు పిలుపు..!
ECB : కొత్త కోచ్, కొత్త కెప్టెన్ నేతృత్వంలో ఇంగ్లండ్(England) జట్టు తొలి పరీక్షకు సిద్ధమవుతోంది. జో రూట్ సారథ్యం, స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచింగ్‌లో మొట్టమొదటి టెస్టు సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్ స్క్వాడ్‌ను ప్రకటించింది.
ECB : కొత్త కోచ్, కొత్త కెప్టెన్ నేతృత్వంలో ఇంగ్లండ్(England) జట్టు తొలి పరీక్షకు సిద్ధమవుతోంది. జో రూట్ సారథ్యం, స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచింగ్‌లో మొట్టమొదటి టెస్టు సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్ స్క్వాడ్‌ను ప్రకటించింది. స్వదేశంలో పాకిస్థాన్‌తో మూడు టెస్టుల సిరీస్ కోసం గురువారం ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు() పటిష్టమైన బృందాన్ని ఎంపిక చేసింది. తొలి రెండు మ్యాచ్‌లకు యువకెరటం జాకబ్ బెథెల్ దూరమవ్వగా.. సీనియర్ ఓలీ పోప్ స్క్వాడ్‌లోకి వచ్చాడు.
బజ్ బాల్ ఆటకు చెల్లుచీటీ ఇచ్చిన ఇంగ్లండ్ నాయకత్వ మార్పు, కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ రాక అనంతరం తొలి పరీక్ష ఎదుర్కోనుంది. స్వదేశంలో పాకిస్థాన్‌తో టెస్టు సవాల్‌కు కాచుకొని ఉంది జో రూట్ సేన. దాంతో, మొదటి రెండు టెస్టులకు గురువారం సెలెక్టర్లు 16 మందితో కూడిన స్క్వాడ్‌ను ఎంపిక చేశారు. అయితే.. జాకబ్ బెథెల్ అనూహ్యంగా స్క్వాడ్‌కు దూరమయ్యాడు. ఇటీవల టీ20లు, వన్డేల్లో ఓపెనర్‌గా రాణిస్తున్న బెథెల్ మోకాలి గాయం కారణంగా అందుబాటులో లేడు. న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడని సీనియర్ బ్యాటర్ ఓలీ పోప్, బ్రైడన్ కార్సే, డాన్ లారెన్స్ లకు అవకాశం దక్కింది. జోర్డాన్ కాక్స్ మూడో స్థానంలో ఆడనున్నాడు.
How England may line up in their first Test of the post-Bazball era 🏴 pic.twitter.com/fSgangovhg
— Cricinfo (@cricinfo) August 6, 2026
ఈమధ్యే న్యూజిలాండ్ చేతిలో 2-1తో సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ ఈసారి పంజా విసరాలనుకుంటోంది. పాకిస్థాన్‌తో ఆగస్టు 19 నుంచి హెడింగ్లేలో తొలి టెస్టు మొదలవ్వనుంది. రెండో మ్యాచ్ ఆగస్టు 27 నుంచి.. మూడోది సెప్టెంబర్ 9వ తేదీన జరుగనుంది.
ఇంగ్లండ్ టెస్టు స్క్వాడ్ : బెన్ డకెట్, ఎమిలియే గే, ఓలీ పోప్, జో రూట్(కెప్టెన్), జేమీ స్మిత్(వికెట్ కీపర్), ఆర్చర్, అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, కార్సే, సామ్ కుక్, జోర్డాన్ కాక్స్, మాథ్యూ ఫిషర్, డాన్ లారెన్స్, రాబిన్సన్, టంగ్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

