The Paradise teaser | టాలీవుడ్ స్టార్ యాక్టర్ నాని (Nani) కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం ది ప్యారడైజ్ (THE PARADISE). దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మోహన్ బాబు, తనికెళ్లభరణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన నాని, మోహన్ బాబు పోస్టర్లు, గ్లింప్స్ నెట్టింట హైప్ క్రియేట్ చేస్తున్నాయి. కొత్త అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌కు టీజర్ రూపంలో అదిరిపోయే వార్తను అందించారు మేకర్స్.
ది ప్యారడైజ్ టీజర్‌ను లాంచ్ చేశారు. ఇక నుంచి ఈ జాగా మనదే.. అంటూ గూస్బంప్స్ తెప్పించే డైలాగ్‌తో షురూ అయింది టీజర్. మే ప్యారే ప్యారడైజ్ వాసియో అంటూ మోహన్ బాబు స్టైలిష్ ఎంట్రీ ఇవ్వగా.. సర్కార్ ఉన్నది ఈ దొరల కోసమా..? జనం కోసమా..? అంటూ సంభాషణలు సాగుతున్నాయి. చీ అని చీదరించుకునే నలుపురంగే మన జెండా.. కాకే దాని మీద గుర్తు అంటూ..నాని ఓ జాతికి నాయకత్వం వహించే నాయకుడిగా అదిరిపోయే యాక్టింగ్‌తో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని టీజర్ చెప్పకనే చెబుతోంది. నాని నయా అవతార్, మోహన్ బాబు స్టైలిష్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
ది ప్యారడైజ్‌లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి సోనాలి కులకర్ణి కీ రోల్లో నటిస్తుండగా.. కిల్ ఫేం రాఘవ్ జుయల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఓ వైపు బ్లాక్ బస్టర్ దసరా కాంబో రిపీట్ అవడం, మరోవైపు జెర్సీ, గ్యాంగ్ లీడర్ తర్వాత నాని-అనిరుధ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ది ప్యారడైజ్‌పై క్యూరియాసిటీ పెరిగిపోతుంది.
Welcome to the world of #TheParadise 🤗❤️
Teaser Out Now!
— https://t.co/8CLE7GzmIC pic.twitter.com/OV5WMmTVcT— Srikanth Odela (@odela_srikanth) August 6, 2026