డెహ్రాడూన్: ఒక మంత్రి భర్త వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రూ.20,000కే బీహార్ అమ్మాయిలు పెళ్లికి అందుబాటులో ఉన్నారని అన్నారు. (Bihar Girls Available For Marriage) ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ మంత్రి రేఖా ఆర్య ఆ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి. ఆమె భర్త గిరిధారి లాల్ సాహు, అల్మోరాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మీరు వృద్ధాప్యంలో పెళ్లి చేసుకుంటారా? మీరు పెళ్లి చేసుకోలేకపోతే మీ కోసం బీహార్ నుంచి అమ్మాయిని తీసుకువస్తాం. రూ.20,000 నుంచి రూ.25,000కే అక్కడి నుంచి అమ్మాయిలను తెచ్చుకోవచ్చు’ అని అన్నారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మహిళా, శిశు సంక్షేమ మంత్రి రేఖా ఆర్య భర్త గిరిధారి లాల్ సాహు వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. దేశంలోని మహిళలను ఆయన అవమానించారని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ విమర్శించింది. అధికార బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
మరోవైపు బీహార్ మహిళా కమిషన్ కూడా దీనిపై స్పందించింది. ఆ రాష్ట్ర అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గిరిధారి లాల్ సాహుకు నోటీస్ జారీ చేస్తామని పేర్కొంది. అయితే ఆయన వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ తెలిపింది.
Also Read:
Pregnant Woman Walks 6 km | ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచిన నిండు గర్భిణీ.. పరిస్థితి విషమించి మృతి
Watch: మొబైల్ ఫోన్‌తో వ్యక్తిని స్కాన్ చేసిన పోలీస్.. బంగ్లాదేశీయుడో కాదో గుర్తిస్తుందని వెల్లడి