ముంబై: మారుమూల గ్రామంలో ఎలాంటి వైద్య సదుపాలు లేకపోవడంతో నిండు గర్భిణీ పెద్ద సాహసం చేసింది. ప్రసవం కోసం భర్తతో కలిసి ఆరు కిలోమీటర్ల దూరం నడిచింది. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె మరణించింది. (Pregnant Woman Walks 6 km) మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ విషాద సంఘటన జరిగింది. ఆల్దండి తోలా గ్రామానికి చెందిన 24 ఏళ్ల ఆషా సంతోష్ కిరంగ తొమ్మిది నెలల గర్భవతి. ఆ గ్రామంలో డెలివరీ సౌకర్యాలు లేవు. ఆ గ్రామం నుంచి ప్రధాన రహదారికి ఎలాంటి రోడ్డు మార్గం కూడా లేదు.
కాగా, ఈ పరిస్థితుల్లో నిండు గర్భిణీ అయిన ఆషా పెద్ద సాహసం చేసింది. ప్రసవం కోసం పెథాలోని తన సోదరి ఇంటికి బయలుదేరింది. జనవరి 1న భర్తతో కలిసి అటవీ దారిలో ఆరు కిలోమీటర్ల దూరం నడిచింది. పెథాలోని సోదరి ఇంటికి చేరేసరికి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది.
మరోవైపు జనవరి 2న ఆషాకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. అంబులెన్స్‌లో హెడ్రిలోని కాళీ అమ్మల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేయాలని తెలిపారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో గర్భంలోని శిశువు చనిపోయింది. రక్తపోటు పెరుగడం వల్ల ఆషా కూడా మరణించింది. ఈ సమాచారం తెలుసుకున్న వైద్యాధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Indore Toxic water kills baby | పాలలో నీరు కలిపి పసి బాలుడికి తాగించారు.. అనారోగ్యంతో మృతి
Watch: స్వాతంత్ర్యం సిద్ధించిన 78 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి రోడ్డు.. తొలి బస్సుకు ఘన స్వాగతం