Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ (Pawan Kalyan)టైటిల్ రోల్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). హరీష్ శంకర్ (Harish shankar) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. రాశీఖన్నా కీలక పాత్రలో నటిస్తోంది. టాలీవుడ్ టాప్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. కాగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మేకర్స్ డీఎస్పీని పక్కన పెట్టారని.. అతడి ప్లేస్‌లో ఎస్ థమన్‌ను తీసుకున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటన చేస్తూ మూవీ లవర్స్‌కు క్లారిటీ ఇచ్చారు.
పవన్ కల్యాణ్ కోసం ఇద్దరు స్టాల్వార్ట్ మ్యూజిషియన్స్ చేతులు కలిపారు. ఉస్తాద్ భగత్ సింగ్ పాటలు దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేస్తే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థమన్ ఇవ్వబోతున్నాడు. ఇది అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే లైఫ్ టైం మెమొరీ. ముందుగా పెట్టుకున్న కమిట్ మెంట్స్ కారణంగా డీఎస్పీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు సమయం ఇవ్వలేకపోతున్నాడంటూ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టాడు.
టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ కంపోజర్లలో టాప్‌లో ఉంటారు దేవీ శ్రీ ప్రసాద్, ఎస్ థమన్. మ్యూజిక్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడంలో ఎవరి స్టైల్ వారిదే. వీరి మ్యూజిక్ స్టైల్‌కు సఫరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరి కాంబోలో పవన్ కల్యాణ్ సినిమా ఉండబోతుందంటే అభిమానులకు త్రిబుల్ ట్రీట్ అనే చెప్పాలి.
ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన దేఖ్ లేంగే సాలా, Aura Of Ustaad సాంగ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌లో భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ పవన్ కల్యాణ్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
Two stalwart musicians join hands for PSPK ❤🔥#UstaadBhagatSingh songs by @ThisisDSP & the background score by @MusicThaman are going to be a treat 💥💥
This will be a grand celebration and a lifetime memory for fans ❤️
POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14… pic.twitter.com/060Vz0ONFK
— Mythri Movie Makers (@MythriOfficial) March 4, 2026
Pahalgam Attack: పెహల్గామ్ ఉగ్రదాడి.. చైనా సాయం కోరిన ఎన్ఐఏ కోర్టు
Dragon | మే 20న ‘డ్రాగన్’ విస్ఫోటనం .. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కోసం మేకర్స్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు!
Sircilla | సిరిసిల్ల జిల్లాలో ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి.. 10 మందికి గాయాలు