Dragon | మే 20న ‘డ్రాగన్’ విస్ఫోటనం .. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కోసం మేకర్స్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు!
Dragon | మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ హీరోగా, సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీలః్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.ఈ సినిమాలో తారక్ పూర్తిగా స్లిమ్ లుక్‌లో కనిపించనున్నారని తెలిసి అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది
Dragon | మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ హీరోగా, సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీలః్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.ఈ సినిమాలో తారక్ పూర్తిగా స్లిమ్ లుక్‌లో కనిపించనున్నారని తెలిసి అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇటీవల ఆయన షూటింగ్‌లకు వెళ్తున్న సమయంలో తీసిన కొన్ని ఆఫ్‌లైన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే సినిమా సెట్స్ నుంచి మాత్రం చిన్న లీక్ కూడా బయటకు రాకుండా మేకర్స్ కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
ప్రత్యేకంగా ‘డ్రాగన్’ ఫస్ట్ లుక్ విడుదలయ్యే వరకు ఎలాంటి విజువల్స్ బయటకు రాకూడదని చిత్రబృందం కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ ఏమాత్రం తగ్గకుండా, ఒక్కసారిగా భారీ ఇంపాక్ట్ ఇవ్వాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారట.మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఆ పోస్టర్ లేదా గ్లింప్స్ మొత్తం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించేలా ఉండబోతుందని టాక్. ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలతో భారీ యాక్షన్ విజువల్స్‌కు కొత్త ప్రమాణాలు సృష్టించిన ప్రశాంత్ నీల్, ఈసారి తారక్‌ను పూర్తిగా కొత్త అవతారంలో చూపించబోతున్నారని సమాచారం.
మేకర్స్ ప్లాన్ ప్రకారం ఫస్ట్ లుక్ ఒక్కటే సినిమా హైప్‌ను మరోస్థాయికి తీసుకెళ్లేలా ఉండబోతోందట. ముఖ్యంగా ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలయ్యే ఈ అప్డేట్ ఇంటర్నెట్ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. చూడలి మరి మే 20న ‘డ్రాగన్’ నుంచి రాబోయే ఫస్ట్ లుక్ నిజంగా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అనేది. అభిమానులు మాత్రం ఆ రోజు కోసం కౌంట్‌డౌన్ ప్రారంభించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Dragon
- first look
- Jr NTR
- new look
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

