Sircilla | సిరిసిల్ల జిల్లాలో ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి.. 10 మందికి గాయాలు
Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి హామీ కూలీలపై తేనె టీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో కూలీలకు తీవ్రగాయాలయ్యాయి.
Sircilla | కోనరావుపేట, మార్చి 4: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి హామీ కూలీలపై తేనె టీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో కూలీలకు తీవ్రగాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. కోనరావుపేట మండలంలోని నిజామాబాద్లో బుధవారం ఉదయం ఉపాధి పనుల్లో భాగంగా సర్వాయి కాలువ మరమ్మతు పనులను చేపట్టారు. దాదాపు 10 మంది కూలీలు అక్కడ పనిచేస్తుండగా చెట్టుపై ఉన్న తేనె టీగలు వారిపై దాడి చేశారు. తేనె టీగలు మీదకు రావడంతో భయపడిపోయిన కూలీలు అక్కడి నుంచి పరుగులు తీశారు. అప్పటికే వారిని తేనెటీగలు విపరీతంగా కుట్టాయి. ఇది గమనించిన తోటీ కూలీలు.. గాయపడిన వారిని కోనరావుపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. కానీ అక్కడ వైద్య సిబ్బంది అందుబాటులో లేరు. పైగా ప్రభుత్వ అంబులెన్స్ కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం.
ఇక చేసేదేమీ లేక.. గాయపడిన వారిని ట్రాలీ ఆటోలో సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారి వెంట సర్పంచ్ సింగం శ్రీహరి, ఉపసర్పంచ్ లంబ రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్ వెళ్లారు. వారికి మెరుగైన వైద్యం అందిచేలా చూడాలని వైద్యులను కోరారు. కాగా, తేనేటీగల దాడిలో గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వారిలో పులి పాలవ్వ అనే వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

