iPhone 17e : యాపిల్ ఐఫోన్ వాడాలి అనుకునేవారికోసం ఆ సంస్థ ఇప్పుడు అందుబాటు ధరలో ఉండే ఐఫోన్ తీసుకొచ్చింది. ఐఫోన్ 17ఈ పేరుతో కొత్త ఫోన్‌ను యాపిల్ సోమవారం విడుదల చేసింది. గత ఏడాది విడుదలైన, ఈ ఏడాది విడుదల కానున్న ఐఫోన్లలో ఇదే అతి చవకైన ఫోన్ అని యాపిల్ అంటోంది. డిస్ప్లే, చిప్సెట్, కెమెరా వంటి వాటిలో క్వాలిటీ కోరుకునే వారికి ఇది మంచి ఛాయిస్ అని సంస్త చెబుతోంది.
ఈ ఫోన్ ఫీచర్లివి. 256జీబీ/512జీబీ, 6.1 అంగుళాల ఓలెడ్ డిస్ప్లే, 5.78 అంగుళాల పొడవు, 2.82 అంగుళాల వెడల్పు, హ్యాప్టిక్ టచ్, 800 నిట్స్, ఫింగర్‌ప్రింట్ రెసిస్టెన్స్ ఒలియోఫోబిక్ కోటింగ్, యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్, స్టాండర్డ్ 60 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, 48 ఎంపీ సింగిల్ మెయిన్ కెమెరా, 12 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4కే వీడియో రికార్డింగ్, ఐపీ68 రేటింగ్, ఏ19 చిప్సెట్ 3ఎన్ఎం ప్రాసెస్, మ్యాగ్ సేఫ్, సీ1ఎక్స్ 5జీ మోడెమ్ సపోర్ట్, అల్యూమినియం డిజైన్, సిరామిక్ 2 ఫ్రంట్, 26 గంటల వీడియో ప్లే బ్యాక్, గ్లాస్ బ్యాక్, 170 గ్రాముల బరువు, వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్లాక్, వైట్, సాఫ్ట్ పింక్ కలర్స్‌లో లభ్యం.
ధరలు 256జీబీ రూ.64,900, 512 జీబీ రూ.84,900. వివిధ కార్డులపై డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. వీటితో కలిపి మరింత తక్కువ ధరలోనే ఐఫోన్ 17ఈ సొంతం చేసుకోవచ్చు.