NZ vs SA : తొలి సెమీఫైనల్లో టాస్ ఓడినా.. శుభారంభంతో పైచేయి సాధించాలనుకున్న దక్షిణాఫ్రికాకు కొత్త బౌలర్ బిగ్ షాకిచ్చాడు. సూపర్ 8 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ విజయాల్లో కీలకమైన కొలే మెక్కొన్చీ(2-9) ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. తొలి ఓవర్లోనే సిక్సర్ బాదిన క్వింటన్ డికాక్(10)ను బోల్తా కొట్టించిన అతడు.. ఆ తర్వాతి బంతికే డేంజరస్ రియాన్ రికెల్టన్(0)ను గోల్డెన్ డకౌట్‌గా వెనక్కి పంపాడు. ప్రస్తుతం కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్(16 నాటౌట్), డెవాల్లడ్ బ్రెవిస్(15 నాటౌట్)లు దూకుడుగా ఆడుతున్నారు.
తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాకు ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ క్వింటన్ డికాక్(10), రియాన్ రికెల్టన్(0)లను వరుస బంతుల్లో ఔట్ చేసిన కొలే మెక్కొన్చీ(2-9) సఫారీల శుభారంభానికి పగ్గాలు వేశాడు. మెక్కొనిచ్చీ ఊరిస్తూ సంధించిన బంతిని మిడాన్‌లో గాల్లోకి లేపిన డికాక్.. ఫెర్గూసన్ చేతికి చిక్కాడు. ఆ వెంటనే వచ్చిన రికెల్టన్ ఆఫ్ సైడ్ కట్ షాట్ ఆడి ఫిన్ అలెన్‌కు దొరికిపోయాడు.
Off-spin does the trick for the Kiwis! 👏
☝️ de Kock
☝️ RickeltonCole McConchie’s double-wicket over has put South Africa under early pressure! 🥶
ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/5sOpAgpsrX
— Star Sports (@StarSportsIndia) March 4, 2026
అనంతరం ఫెర్గూసన్ ఓవర్లో మర్క్రమ్(16 నాటౌట్) సైతం ఔటయ్యేవాడే. కానీ, రచిన్ రవీంద్ర డైవ్ చేస్తూ క్యాచ్ పట్టబోయి నేలపాలు చేశాడు. లైఫ్ లభించడంతో గేర్ మార్చిన్ మర్క్మర్.. డెవాల్డ్ బ్రెవిస్(15 నాటౌట్)లు ధాటిగా ఆడుతున్నారు. నీషం ఓవర్లో మర్క్రమ్ ఫోర్, సిక్సర్ బాదేయగా.. బ్రెవిస్ రెండు ఫోర్లతో 17 రన్స్ వచ్చాయి. పవర్ ప్లే చివరి ఓవర్లో ఫెర్గూసన్ మూడే పరుగులివ్వగా.. 6 ఓవర్లకు సఫారీ జట్టు 2 వికెట్ల నష్టానికి 48 కొట్టింది.