భోపాల్: ఒక వ్యక్తి పాముతో సంభాషించాడు. తనను కాటు వేయవద్దని చెప్పాడు. ప్రశాంతంగా ఉండాలని దానికి సూచించాడు. (Man Conversation With Snake) ఆ వ్యక్తి మాటలకు స్పందిస్తున్నట్లుగా ఆ పాము పడగ ఊపింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి చలి మంట వద్ద కూర్చొన్నాడు. అతడి పక్కనే నాగుపాము ఉన్నది. ఆ వ్యక్తి సరదాగా దానితో మాట్లాడాడు. తనను కాటు వేయవద్దని, ప్రశాంతంగా ఉండాలని చెప్పాడు. రోడ్డు వద్ద తిరుగుతున్న ఆ పాముకు హానీ జరుగకుండా రక్షించినట్లు అతడు తెలిపాడు.
కాగా, ఆ పాము యోగ క్షేమాలను కూడా ఆ వ్యక్తి ఆరా తీశాడు. ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగాడు. అలాగే రిలాక్స్‌గా ఉండి చలి కాచుకోవాలని చెప్పాడు. అయితే ఆ వ్యక్తి సంభాషణకు ఆ పాము స్పందిస్తున్నట్లుగా కనిపించింది. అతడి మాటలకు పడగను అటూ ఇటూ ఊపింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.
#WATCH | Man Caught In A Hilarious Conversation With #Snake In #Chhatarpur; Video Goes Viral#MadhyaPradesh #MPNews #wildlife pic.twitter.com/FiwLcJq47H
— Free Press Madhya Pradesh (@FreePressMP) January 2, 2026
Also Read:
Cross-Border Kidney Racket | రైతు వీడియో వైరల్.. సరిహద్దులు దాటిన కిడ్నీ రాకెట్ గుట్టురట్టు