Inter student | ప్రేమ.. అసలు ఎప్పుడు.. ఎలా పుడుతుందో చెప్పడం కష్టమే. కానీ పరిణతి వచ్చిన తర్వాత పుట్టే ప్రేమకు.. పరిణతి రాకముందు పుట్టే ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది. గతంలో ఆకర్షణ, ఇతర కారణాలతో ప్రేమలో పడితే.. ఇప్పుడేమో సోషల్ మీడియా ప్రభావంతో ప్రేమలు పుట్టుకొస్తున్నాయి. ఒకరినొకరు చూసుకోకుండానే కేవలం ఆన్లైన్లో చూసుకుని ప్రేమించుకుంటున్నారు. సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎలా ఉందనేది చెప్పడానికి తాజాగా జరిగిన ఈ ఘటనే ఓ ఉదాహరణ.
ఇంటర్ విద్యార్థిని ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడితో ప్రేమలో పడింది. అంతటితో ఆగకుండా తల్లిదండ్రులకు చెప్పకుండా అతన్ని పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమైంది. ఈ ఘటన ఏపీలోని విశాఖపట్నం పరిధిలో వెలుగుచూసింది. విశాఖపట్నానికి చెందిన ఓ యువతికి ఇన్స్టాగ్రామ్లో యువకుడు పరిచయమయ్యాడు. అతడితో ప్రేమలో పడ్డ సదరు యువతి ఆ యువకుడిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయింది.
ఇలా ఇంటర్ పరీక్ష రాసి.. ఆ తర్వాత ఫ్రీ బస్లో కావలికి చేరుకుంది. అర్థరాత్రి ఆ యువతిని గుర్తించిన పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. యువతితోపాటు ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. సోషల్ మీడియాలో మునిగిపోయే పిల్లలను గమనిస్తూ ఉండాలని పోలీసులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.
Pahalgam Attack: పెహల్గామ్ ఉగ్రదాడి.. చైనా సాయం కోరిన ఎన్ఐఏ కోర్టు
Dragon | మే 20న ‘డ్రాగన్’ విస్ఫోటనం .. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కోసం మేకర్స్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు!
Sircilla | సిరిసిల్ల జిల్లాలో ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి.. 10 మందికి గాయాలు