న్యూయార్క్: అమెరికా-ఇజ్రాయెల్ సైనిక దాడులు, ఇరాన్ ప్రతిదాడులను ఐక్యరాజ్యసమితి స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఖండించింది. (US-Iran War) ఈ దాడులు అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని విమర్శించింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సైనిక దాడులు, ఆ దేశ హక్కుల ఉల్లంఘనపై ఐక్యరాజ్యసమితి స్వతంత్ర అంతర్జాతీయ నిజనిర్ధారణ మిషన్ దర్యాప్తు చేస్తున్నది. అమెరికా- ఇజ్రాయెల్ దాడులతోపాటు గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ ప్రతిదాడులను ఖండించింది.
కాగా, అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ఆ తర్వాత ఈ ప్రాంతంలో ఇరాన్ ప్రతిదాడులు
దేశ ప్రాదేశిక సమగ్రత లేదా రాజకీయ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా బలప్రయోగాన్ని నిషేధించే ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు విరుద్ధంగా ఉన్నాయని స్వతంత్ర దర్యాప్తు కమిటీ పేర్కొంది. మూడు దేశాల చర్యను ఐరాస స్వతంత్ర దర్యాప్తు అధికారులు తప్పుపట్టారు.
Also Read:
Mehbooba Mufti | నెతన్యాహు, ట్రంప్ పోస్టర్లకు.. నిప్పంటించిన మెహబూబా ముఫ్తీ
Watch: లిఫ్ట్‌లో తలెత్తిన సమస్య.. వ్యక్తికి తృటిలో తప్పిన ముప్పు