NZ vs SA | టాస్ గెలిచిన న్యూజిలాండ్.. సఫారీలపై తొలి విజయంతో చరిత్ర సృష్టించేనా..?
NZ vs SA : ఆల్‌రౌండ్ షోతో ప్రత్యర్థులకు చెక్ పెడుతున్న సఫారీ టీమ్.. తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను ఢీకొడుతోంది. టాస్ గెలిచిన బ్లాక్ కాప్స్ సారథి శాంట్నర్ బౌలింగ్ తీసుకున్నాడు.
NZ vs SA : టీ20 ప్రపంచకప్ కప్‌లో నాకౌట్ సమరానికి వేళైంది. కలల కప్ వేటలో చివరి దశకు చేరలీగ్ దశ నుంచి అజేయంగా .. ఆపై సూపర్ 8లోనూ ఓటమి ఎరుగని దక్షిణాఫ్రికా వరుసా రెండోసారి ఫైనల్‌పై గురి పెట్టింది. ఆల్‌రౌండ్ షోతో ప్రత్యర్థులకు చెక్ పెడుతున్న సఫారీ టీమ్.. తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను ఢీకొడుతోంది.
పొట్టి వరల్డ్‌కప్ చరిత్రలో ఒక్కసారి కూడా ప్రొటీస్‌పై గెలుపొందిన కివీస్.. ఈసారి చరిత్ర తిరగరాసేందుకు సిద్ధమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు అభిమానులను అలరించడం ఖాయం. టాస్ గెలిచిన బ్లాక్ కాప్స్ సారథి శాంట్నర్ బౌలింగ్ తీసుకున్నాడు.
Mitchell Santner wins the toss, New Zealand will bowl first in the #T20WorldCup semi-final in Kolkata!
Ball-by-ball: https://t.co/WQ4yyLbm3x pic.twitter.com/mCKjlKLEfd
— ESPNcricinfo (@ESPNcricinfo) March 4, 2026
దక్షిణాఫ్రికా తుది జట్టు : ఎడెన్ మర్క్రమ్(కెప్టెన్), క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), రియాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కేశవ్ మహారాజ్, కార్బిన్ బాష్, లుంగి ఎంగిడి, మార్కో యాన్సెన్, కగిసో రబడ.
న్యూజిలాండ్ తుది జట్టు : ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్(వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫెలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), కొలే మెక్కొన్చీ, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్.
జింబాబ్వేతో సూపర్ 8 చివరి మ్యాచ్‌కు దూరమైన రబడ, యాన్సెన్, కేశవ్ మహారాజ్‌లు తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు చరిత్రాత్మక విజయం కోసం నిరీక్షిస్తున్న కివీస్ .. పేసర్ హెన్రీ, ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్‌ను ఆడిస్తోంది. రికార్డుల పరంగా బ్లాక్‌క్యాప్స్‌పై దక్షిణాఫ్రికాదే ఆధిపత్యం. కానీ.. సూపర్ 8లో సంచలన ఆటతో పుంజుకున్న కివీస్.. సఫారీల టైటిల్ కలల్ని భగ్నం చేసినా ఆశ్చర్యమేమీలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

