‘డాక్టర్ కావాలనుకొని యాక్టర్ అయ్యాను’ అని చాలామంది హీరోయిన్లు చెబుతుంటారు. సాయిపల్లవి, శ్రీలీల లాంటి హీరోయిన్లయితే.. డాక్టర్ చదివి కూడా యాక్టర్లయిపోయారు. మలయాళ మందారం ఐశ్వర్య లక్ష్మి కూడా వారి దారిలోనే డాక్టర్ చదివి యాక్టరై విజయాలను అందుకుంటున్నది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘అనుకున్నది జరక్కపోవడమే జీవితం. నన్ను డాక్టర్‌గా చూడాలని మా అమ్మానాన్నల కోరిక. నేను కూడా కష్టపడి హౌస్ సర్జన్ చేశాను.
ప్రాక్టీస్ మొదలుపెడితే నా కెరీర్ వేరేలా ఉండేదేమో. కానీ నేను అనుకోకుండా మోడలింగ్ వైపు మళ్లాను. తర్వాత సినిమా పిలిచింది. తొలినాళ్లలో అమ్మానాన్నకు నా ప్రవర్తన మింగుడు పడలేదు. విజయాలు రావడం, నా నటనను అంతా మెచ్చుకోవడం.. ఇవన్నీ చూసి వాళ్లు కూడా సైలెంట్ అయిపోయారు’ అంటూ ఐశ్వర్య లక్ష్మి చెప్పుకొచ్చింది. సాయిదుర్గతేజ్కు జోడీగా ఆమె నటించిన ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా త్వరలోనే విడుదల కానున్నది.