Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై భారీ ప్లాన్.. సెకండాఫ్‌లో చాలా మార్పులు చేసిన బాలకృష్ణ..!
Mokshagna | నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ తేజ సినీ అరంగేట్రంపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Mokshagna | నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ తేజ సినీ అరంగేట్రంపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు ‘సింబా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే విషయంలో బాలకృష్ణ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు వశిష్ట చెప్పిన కథపై బాలయ్య సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. ముఖ్యంగా సెకండాఫ్‌లో భావోద్వేగాలను మరింత బలంగా చూపించేందుకు కొన్ని మార్పులు, చేర్పులు సూచించినట్లు సమాచారం.
మాస్ ప్రేక్షకుల పల్స్‌పై మంచి అవగాహన ఉన్న బాలకృష్ణ సూచనలను దర్శకుడు పరిగణనలోకి తీసుకుని స్క్రిప్ట్‌ను మరింత పకడ్బందీగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. అయితే ఈ వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌పై వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన వార్త బాలకృష్ణ పాత్రకు సంబంధించినది. సినిమాలో బాలకృష్ణ కూడా కీలకమైన పాత్రలో కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కథను మలుపు తిప్పే సమయంలో ఆయన తెరపైకి వస్తారని, మోక్షజ్ఞకు తండ్రి పాత్రలోనే కనిపించే అవకాశం ఉందని టాక్. అదే నిజమైతే తొలిసారి బాలకృష్ణ, మోక్షజ్ఞలను ఒకే ఫ్రేమ్‌లో చూసే అవకాశం నందమూరి అభిమానులకు దక్కనుంది. అయితే బాలయ్య పాత్రపై కూడా ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
మోక్షజ్ఞను సాధారణ మాస్ లేదా లవ్‌స్టోరీతో కాకుండా సరికొత్త జానర్లో పరిచయం చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో టైమ్ ట్రావెల్, పునర్జన్మ అంశాలతో తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. దర్శకుడు వశిష్ట గతంలో ‘బింబిసార’తో సోషియో ఫాంటసీ జానర్‌ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవితో ఆయన రూపొందిస్తున్న ‘విశ్వంభర’పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ తొలి సినిమాకు వశిష్ట దర్శకత్వం వహించనున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. ఇక హీరోయిన్ విషయంలో కూడా ఓ ఆసక్తికరమైన పేరు వినిపిస్తోంది. మోక్షజ్ఞ సరసన శ్రీలీలను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘భగవంత్ కేసరి’లో బాలకృష్ణతో కలిసి నటించిన శ్రీలీల.. ఇప్పుడు ఆయన తనయుడు మోక్షజ్ఞతో జోడీ కడితే ఈ కాంబినేషన్‌పై మంచి ఆసక్తి ఏర్పడే అవకాశం ఉంది.అయితే హీరోయిన్ ఎంపికపై కూడా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

