Game of Thrones | సినిమాగా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’.. డ్రాగన్ల విధ్వంసం ఇక థియేటర్లలో
GOT Series | ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఫాంటసీ డ్రామా 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'(Game of Thrones) ఇప్పుడు వెండితెరపైకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.
Aegon’s Conquest | ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఫాంటసీ డ్రామా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్'(Game of Thrones) ఇప్పుడు వెండితెరపైకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. వెస్టెరోస్ ప్రపంచాన్ని థియేటర్లలో ఆవిష్కరించేందుకు వార్నర్ బ్రదర్స్ అధికారికంగా పనులు మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ ఫ్రాంచైజీలో రాబోయే మొట్టమొదటి సినిమాగా ‘ఏగాన్ కాంక్వెస్ట్’ (Aegon’s Conquest) పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ కథకు సుమారు 300 ఏళ్ల ముందు జరిగిన పరిణామాల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. టార్గేరియన్ వంశానికి చెందిన ఏగాన్ I (Aegon the Conqueror) తన సోదరీమణులు మరియు శక్తివంతమైన డ్రాగన్ల సహాయంతో ఏడు రాజ్యాలను ఎలా జయించి, వాటన్నింటినీ ఏకం చేసి సింహాసనాన్ని దక్కించుకున్నాడనే కథాంశంతో ఈ సినిమా సాగనుంది.
ఈ భారీ ప్రాజెక్టు కోసం ‘హౌస్ ఆఫ్ కార్డ్స్’ మరియు ‘అండర్’ వంటి అద్భుతమైన సిరీస్‌లకు పనిచేసిన రచయిత బ్యూ విల్లిమోన్ స్క్రీన్ ప్లే అందించబోతున్నాడు. దీనిని ‘డ్యూన్’ తరహాలో అత్యంత భారీ విజువల్స్ మరియు భారీ బడ్జెట్‌తో ఒక సినిమాటిక్ వండర్‌గా తీర్చిదిద్దాలని మేకర్స్ భావిస్తున్నారు. నిజానికి ఏగాన్ కాంక్వెస్ట్పై హెచ్బిఓ ఒక టీవీ సిరీస్‌ను కూడా ప్లాన్ చేసినప్పటికీ, వార్నర్ బ్రదర్స్ దీనిని ప్రత్యేకంగా థియేటర్ల కోసమే ఫీచర్ ఫిల్మ్‌గా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే నటీనటుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sajjanar | పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా తగ్గేది లేదు.. సజ్జనార్ కీలక వ్యాఖ్యలు!
మాల వేసుకుని చెప్తున్న.. కాంగ్రెస్ మళ్లా రాదు!.. సీఎం కరప్షన్‌తో తీవ్రనష్టం.. రేవంత్‌పై ఎమ్మెల్యే రాజగోపాల్ ఫైర్
Harish Rao | మాటల్లో వజన్ లేదు.. చేతల్లో విజన్ లేదు.. సిద్దిపేటలో రేవంత్‌రెడ్డి చిల్లర ప్రసంగంపై హరీశ్‌రావు ఫైర్
Land Scam | మాజీ డీజీపీ భూమికి ఎసరు.. 4.27 ఎకరాల పట్టాభూమి రియల్టర్ పేరు పైకి!
KTR | 5 లక్షల కోట్ల అవినీతి.. రేవంత్‌రెడ్డి దందాలను సొంత ఎమ్మెల్యేలే బయటపెడుతున్నరు: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

