బెంగళూరు: స్కూల్లో కలిసి చదువుకున్న వివాహితురాలైన స్నేహితురాలిని ఒక వ్యక్తి పెళ్లి కోసం బలవంతం చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో కత్తితొ పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (Man Murders Woman Friend, Sucide) కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 30 ఏళ్ల రంజితకు 12 ఏళ్ల కిందట మహారాష్ట్రకు చెందిన సచిన్ కటేరాతో పెళ్లి జరిగింది. వారికి పదేళ్ల కుమారుడు ఉన్నాడు.
కాగా, వ్యక్తిగత కారణాల వల్ల భర్త నుంచి రంజిత విడిపోయింది. కర్ణాటకలోని యల్లాపూర్లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం సహాయకురాలిగా ఆమె పని చేస్తున్నది.
మరోవైపు చిన్నప్పుడు స్కూల్లో కలిసి చదువుకున్న స్నేహితుడు రఫీక్ ఇమామ్సాబా తరచుగా రంజిత ఇంటికి వచ్చి భోజనం చేసేవాడు. వారిద్దరి మధ్య చనువు పెరిగింది. ఈ నేపథ్యంలో భర్తను వీడి ఒంటరిగా జీవిస్తున్న ఆమెను పెళ్లి చేసుకుంటానని అతడు ఒత్తిడి చేశాడు. రంజిత, ఆమె కుటుంబం దీనికి ఒప్పుకోలేదు.
అయితే పెళ్లికి వ్యతిరేకించిన రంజిత పట్ల రఫీక్ కక్షగట్టాడు. జనవరి 3న స్కూల్ పని తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్న ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన రంజితను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఆ తర్వాత అటవీ ప్రాంతంలోని చెట్టుకు ఉరివేసుకుని రఫీక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు సంఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Sacrifice For Treasure | గుప్త నిధుల కోసం బాలుడ్ని బలి ఇచ్చేందుకు యత్నం.. కాపాడిన అధికారులు
Retired Teacher, Wife Found Dead | రిటైర్డ్ టీచర్, భార్య అనుమానాస్పద మృతి.. హత్యగా పోలీసులు అనుమానం
Massive Fire At Railway Station | రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం.. 200కు పైగా వాహనాలు దగ్ధం