Yadagirigutta | సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా రేపు యాదగిరిగుట్ట ఆలయం మూసివేత
Yadagirigutta | ఈ నెల 3న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ ఈవో భవానీశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Yadagirigutta | యాదగిరిగుట్ట, మార్చి1: ఈ నెల 3న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ ఈవో భవానీశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా ప్రధానాలయంతో పాటు ఉపాలయాలు, అనుబంధ దేవాలయాలలో ఉదయం 7 గంటలలోపు సుప్రభాత, నిజాభిషేకం, అర్చనలు ముగించి మూసివేస్తామని వెల్లడించారు.
4వ తేదీన ఉదయం 3 నుంచి 5.30 గంటల వరకు ప్రధానాలయంతో పాటు ఉపాలయాలను తెరిచి గ్రహణ దోష పరిహారార్థం సంప్రోక్షణ, ఆలయ శుద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం సుప్రభాతం, తిరువారాధన, బాలబోగం, ఆరగింపు, నిజాభిషేకం నిర్వహించి, ఉదయం 8.45 గంటలకు ఉభయ దర్శనాలను ప్రారంభిస్తామని చెప్పారు. చంద్రగ్రహణం సందర్భంగా స్వామివారి సన్నిధిలో రేపు జరిగే హోలికోత్సవాన్ని సోమవారం సాయంత్రం నిర్వహిస్తామని ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

