Inter Caste Marriage | కులాంతర పెండ్లికి 5 లక్షల ఆర్థిక సాయం.. కేంద్రం కీలక ప్రకటన!
Inter Caste Marriage | దేశంలో కులాంతర వివాహం చేసుకునే జంటకు రూ.5 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాన్ని కల్పించే పథకాన్ని కేంద్రం ప్రకటించింది. అర్హత కలిగిన జంటలకు రూ.50వేల నుంచి రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేసే డాక్టర్ అంబేద్కర్ సామాజిక సమగ్రత పథకాన్ని ప్రవేశపెట్టింది.
Inter Caste Marriage | న్యూఢిల్లీ, ఆగస్టు 10: దేశంలో కులాంతర వివాహం చేసుకునే జంటకు రూ.5 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాన్ని కల్పించే పథకాన్ని కేంద్రం ప్రకటించింది. అర్హత కలిగిన జంటలకు రూ.50వేల నుంచి రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేసే డాక్టర్ అంబేద్కర్ సామాజిక సమగ్రత పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనం కేవలం దంపతులలో ఒకరు షెడ్యూల్డ్ కులానికి(ఎస్సీ) చెందిన వారై, మరొకరు ఎస్సీయేతర వర్గానికి(అంటే జనరల్ లేదా ఓబీసీ వర్గానికి) చెందినవారైనప్పుడు మాత్రమే లభిస్తుంది. ఆ వివాహం వారిద్దరికీ మొదటి వివాహమై ఉండాలి. అంటే వారిలో ఎవరూ ఇదివరకే వివాహం చేసుకొని ఉండకూడదు.
పథకంలో కీలక అంశాలు
వివాహం చట్టపరంగా నమోదైతేనే ఈ పథకానికి చెందిన ప్రయోజనం లభిస్తుంది. దీని కోసం వివాహం తప్పనిసరిగా హిందూ వివాహ చట్టం, 1955 లేదా ప్రత్యేక వివాహ చట్టం కింద నమోదై ఉండాలి. వివాహిత జంటలు తమ వివాహం జరిగిన ఒక సంవత్సరం లోపు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. సమాజం నుండి అంటరానితనాన్ని, కులపరమైన విభజనలను తొలగించడమే ఈ పథకాల ప్రధాన ఉద్దేశం.
అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వారు, సంబంధిత నిబంధనల ప్రకారం తమ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ లేదా కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ సామాజిక సమగ్రత పథకాన్ని ఈ ఉద్దేశంతోనే నిర్వహిస్తున్నది.
అంతేగాకుండా ఉత్తర్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ సొంత కులాంతర వివాహ ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకాల కింద అందించే ఆర్థిక సహాయం రాష్ర్టాల వారీగా మారుతూ ఉంటుంది. ఇది రూ.50,000 నుండి రూ.5లక్షల వరకు ఉంటున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

