‘పెద్ది’ చిత్రంతో ఈ ఏడాది భారీ విజయాన్ని దక్కించుకున్నారు అగ్ర హీరో రామ్‌చరణ్. ఆయన తదుపరి చిత్రం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. అర్బన్ ైస్టెలిష్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతున్నదని సమాచారం. తాజాగా రామ్‌చరణ్ మరో ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన అప్డేట్ బయటికొచ్చింది. ‘తానాజీ’ ‘ఆదిపురుష్’ వంటి చిత్రాలతో బాలీవుడ్లో పేరు పొందిన ఓంరౌత్ దర్శకత్వంలో రామ్‌చరణ్ ఓ చిత్రాన్ని చేయబోతున్నారని తెలిసింది. ఇటీవల రామ్‌చరణ్‌కు ఓంరౌత్ కథ వినిపించారని, ఆయన సానుకూలంగా స్పందించారని ఫిల్మ్‌నగర్ టాక్. పీరియాడిక్ హిస్టారికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.