Colombia Earthquake | కొలంబియాలో పెను విషాదం మిగిల్చిన భూకంపం.. 132 మంది మృతి, 570 మందికి గాయాలు..!
Colombia Earthquake | కొలంబియాలో భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. సోమవారం పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో ఏర్పడిన భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య 132కు చేరింది. మరో 570 మంది గాయపడ్డారు.
Colombia Earthquake | కొలంబియాలో భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. సోమవారం పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో ఏర్పడిన భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య 132కు చేరింది. మరో 570 మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
భూకంప కేంద్రం చోకో ప్రాంతంలోని శాన్ జోసె డెల్ పాల్మార్ సమీపంలో ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. భూకంపం సుమారు 107 కిలోమీటర్ల లోతులో సంభవించింది. దీని ప్రకంపనలు కొలంబియాలోని కాలీ, పెరీరా, మానిజాలెస్, బొగోటా తదితర ప్రాంతాలతోపాటు పొరుగు దేశాల్లోనూ నమోదయ్యాయి.
శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం..
ఈ భూకంప ధాటికి అనేక ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి. కాలీలోని ఓ ఆసుపత్రిలో పీడియాట్రిక్, నియోనేటల్ విభాగాలు దెబ్బతిన్నాయి.శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని రక్షణ సిబ్బంది వెలికితీశారు. ఆసుపత్రుల్లోని కొంతమంది రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాలీలోనే 30 శాతం వరకు ఆసుపత్రి నిర్మాణం దెబ్బతిన్నట్టు స్థానిక అధికారులు తెలిపారు.
పెరీరా, కాలీ నగరాల్లో భవనాల కూలిపోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. మానిజాలెస్లోని చారిత్రక కేథడ్రల్ టవర్ ఒకటి కూలిపోయింది. పలు ఇళ్లు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు కూడా దెబ్బతిన్నాయి.
జాతీయ విపత్తుగా ప్రకటించిన కొలంబియా
భూకంప తీవ్రత దృష్ట్యా కొలంబియా ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించింది. సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు సైనిక బలగాలను రంగంలోకి దించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సజీవంగా బయటకు తీసుకురావడమే తమ తొలి ప్రాధాన్యమని అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లా తెలిపారు.
సైన్యం ప్రత్యేక శిక్షణ పొందిన రెస్క్యూ సిబ్బంది, శిథిలాల్లో చిక్కుకున్న వారిని గుర్తించే పరికరాలు, శునక దళాలను రంగంలోకి దించింది. రిమోట్ ప్రాంతాల్లో రహదారులు, సమాచార వ్యవస్థలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
భూకంపం కారణంగా పశ్చిమ కొలంబియాలోని పలు విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. పెరీరా, మానిజాలెస్, ఆర్మేనియా, కార్టాగో, బ్యూనవెంచురా తదితర విమానాశ్రయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల వైద్య, ప్రభుత్వ విమానాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.
మరోవైపు కొలంబియాకు సాయం చేసేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. ఈక్వెడార్ 47 మంది రెస్క్యూ సిబ్బంది, శిక్షణ పొందిన శునకాలు, ప్రత్యేక పరికరాలను పంపేందుకు సిద్ధమైంది. ఎల్ సాల్వడార్, మెక్సికోతోపాటు అమెరికా కూడా అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆధునిక వ్యవసాయంపై జపాన్లో కలెక్టర్ అంకిత్ అధ్యయనం
‘అర్హులైన చేనేత కార్మికులందరికీ పింఛన్లు ఇవ్వాలి’
Health tips | కాలేయం పనితీరును మెరుగుపర్చే ఈ ఆహారపదార్థాల గురించి మీకు తెలుసా..?
Delhi Police: జర్నలిస్టుల బెనిఫిట్స్.. రీల్మేకర్స్కు వర్తించవు: సుప్రీంలో ఢిల్లీ పోలీసులు
చుక్కలబోడులో పెన్షన్ పత్రాలు అందజేత
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

