‘అర్హులైన చేనేత కార్మికులందరికీ పింఛన్లు ఇవ్వాలి’
అర్హులైన చేనేత కార్మికులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని చండూరు చేనేత సహకార సంఘం డైరెక్టర్ ఏలె శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలో 32 మంది అర్హులను చేనేత చేయూత పింఛన్‌కు ఎంపిక చేయలేదని వారితో పాటు...
– చండూరు చేనేత సహకార సంఘం డైరెక్టర్ ఏలె శ్రీనివాసులు
చండూరు, నవంబర్ 18 : అర్హులైన చేనేత కార్మికులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని చండూరు చేనేత సహకార సంఘం డైరెక్టర్ ఏలె శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలో 32 మంది అర్హులను చేనేత చేయూత పింఛన్‌కు ఎంపిక చేయలేదని వారితో పాటు ఇంకా అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ బుధవారం సీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాపోలు ప్రభాకర్‌తో పాటు పలువురు చేనేత కార్మికులతో కలిసి మున్సిపల్ కమిషనర్ మల్లేషంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు అర్హుల విషయంలో దృష్టి సారించి న్యాయం చేయాలన్నారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారులను కలువనున్నట్లు తెలిపారు.
అర్హులైన వారందరికీ పింఛన్లు వచ్చే వరకు సీపీఎస్ పోరాడుతుందని సీపీఎస్ వ్యవస్థాపక చండూరు అధ్యక్షుడు రాపోలు ప్రభాకర్ అన్నారు.
చండూరు మున్సిపాలిటీతో పాటు మునుగోడు నియోజకవర్గంలోని అర్హులైన చేనేత కార్మికులందరికీ చేయూత పింఛన్లు మంజూరు చేసే వరకు చేనేత పరిరక్షణ సేవా సమితి(సీపీఎస్) పోరాడుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల పింఛన్ల విషయంలో అన్యాయం జరిగిందని, దీనిపై ఉద్యమిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో చేనేత వృత్తిని పరిరక్షించడానికి, పేద కార్మికులను అన్ని విధాల ఆదుకోవడానికి సీపీఎస్‌ను మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెరుపల్లి రాము, గుండు సంతోష్, గంజి పాపయ్య, గడ్డం శేఖర్, రుద్ర స్వామి, గంజి అశోక్, జల్ద దశరథ, చెరుపల్లి శ్రీను, వర్కాల యాదగిరి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన చేనేత కార్మికులందరికీ పింఛన్లు ఇవ్వాలి’
Health tips | కాలేయం పనితీరును మెరుగుపర్చే ఈ ఆహారపదార్థాల గురించి మీకు తెలుసా..?
Delhi Police: జర్నలిస్టుల బెనిఫిట్స్.. రీల్మేకర్స్కు వర్తించవు: సుప్రీంలో ఢిల్లీ పోలీసులు
చుక్కలబోడులో పెన్షన్ పత్రాలు అందజేత
KTR | కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీ ప్రభుత్వం జలదోపిడీ చేస్తుంది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

