ఆధునిక వ్యవసాయంపై జపాన్లో కలెక్టర్ అంకిత్ అధ్యయనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ జపాన్ పర్యటనలో భాగంగా అక్కడి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి ఆధునిక వ్యవసాయ విధానాలు, సాగులో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటల సాగు నుండి నిర్వహణ వరకు వివిధ దశల్లో...
– వ్యవసాయ క్షేత్రాలను సందర్శన
– ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై పరిశీలన
– వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు అనుసరిస్తున్న పద్ధతుల పరిశీలన
భద్రాద్రి కొత్తగూడెం. నవంబర్ 18 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ జపాన్ పర్యటనలో భాగంగా అక్కడి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి ఆధునిక వ్యవసాయ విధానాలు, సాగులో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటల సాగు నుండి నిర్వహణ వరకు వివిధ దశల్లో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్న విధానం, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేందుకు అనుసరిస్తున్న పద్ధతులను తెలుసుకున్నారు. జపాన్లో వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న వినూత్న విధానాలు, యాంత్రీకరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు వినియోగించుకుంటున్న తీరు, పరిమిత వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ అధిక దిగుబడులు సాధిస్తున్న విధానాలను కలెక్టర్ అధ్యయనం చేశారు.

ఆధునిక వ్యవసాయంపై జపాన్లో కలెక్టర్ అంకిత్ అధ్యయనం
ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాల నిర్వహణ, సాగు ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమయం, శ్రమ ఆదా చేస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్న విధానాలను పరిశీలించారు. జపాన్ పర్యటనలో గుర్తించిన ఉత్తమ వ్యవసాయ విధానాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం, స్థానిక పంటల సాగు తీరు, రైతుల అవసరాలకు అనుగుణంగా అన్వయించే అవకాశాలను పరిశీలించనున్నారు. తద్వారా జిల్లాలో వ్యవసాయ రంగానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత చేరువ చేయడంతో పాటు, రైతులకు ప్రయోజనం చేకూర్చే వినూత్న సాగు విధానాలను ప్రోత్సహించేందుకు ఈ అధ్యయనం దోహదపడనుంది.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆధునిక వ్యవసాయంపై జపాన్లో కలెక్టర్ అంకిత్ అధ్యయనం
‘అర్హులైన చేనేత కార్మికులందరికీ పింఛన్లు ఇవ్వాలి’
Health tips | కాలేయం పనితీరును మెరుగుపర్చే ఈ ఆహారపదార్థాల గురించి మీకు తెలుసా..?
Delhi Police: జర్నలిస్టుల బెనిఫిట్స్.. రీల్మేకర్స్కు వర్తించవు: సుప్రీంలో ఢిల్లీ పోలీసులు
చుక్కలబోడులో పెన్షన్ పత్రాలు అందజేత
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

