Revanth Reddy | సీఎం ప్రారంభించిన BFSI కోర్సు అట్టర్‌ప్లాప్.. లక్షలు ఖర్చు చేస్తే కోర్సులో మిగిలింది 136 మంది మాత్రమే!
Revanth Reddy | కోర్సు చదివే సమయంలోనే ఇంటర్న్‌షిప్.. ైస్టెపెండ్.. కోర్సు పూర్తికాగానే జాబ్ గ్యారెంటీ..! ఇలా అనేక మాటలు చెప్పి ప్రారంభించిన ఓ డిగ్రీ కోర్సు అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన ఈ కోర్సుకు ఆదరణ కనిపించడంలేదు.
Revanth Reddy | హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): కోర్సు చదివే సమయంలోనే ఇంటర్న్‌షిప్.. ైస్టెపెండ్.. కోర్సు పూర్తికాగానే జాబ్ గ్యారెంటీ..! ఇలా అనేక మాటలు చెప్పి ప్రారంభించిన ఓ డిగ్రీ కోర్సు అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన ఈ కోర్సుకు ఆదరణ కనిపించడంలేదు. విద్యార్థులు చేరేందుకు ముందుకురావడంలేదు. భవిష్యత్తుపై భరోసా లేకపోవడంతో చేరిన వారు సైతం డ్రాపౌట్ అవుతున్నారు. బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) కోర్సును విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. 2025 జూన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఈ కోర్సును ప్రారంభించారు. ఆరు నెలల వ్యవధి గల ఈ కోర్సు రెగ్యులర్ డిగ్రీకి అదనం. విద్యార్థి 16 క్రెడిట్స్ సాధిస్తే సర్టిఫికెట్ ఇస్తామన్నారు. ఇంజినీరింగ్ సహా ఏ కోర్సువారైనా దీన్ని తీసుకునే అవకాశం ఇచ్చారు
లక్ష్యం 10వేలు.. మిగిలింది 136!
బీఎఫ్ఎస్ఐ సెక్టార్‌కు తీవ్ర డిమాండ్ ఉందని, ఈ రంగంలో విస్తృతంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయని ప్రచారం చేశారు. శిక్షణ సమయంలో రూ. 5వేలు ైస్టెపెండ్ లభిస్తుందని తెలిపారు. ఇంజినీరింగ్‌లో ఈ ఏడాది 5వేల మంది, నాన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 5వేల మంది చొప్పున మొత్తం 10వేల మందిని చేర్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కోర్సు పూర్తిచేసిన వారికి జేపీ మోర్గాన్, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్, స్టేట్ స్ట్రీట్, హెచ్ఎస్బీసీ వంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయని, ఇందుకు ఇటీవలే ఆయా సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్నదని వెల్లడించారు. కొందరు విద్యాశాఖ అధికారులు ఈ కోర్సు స్థితిగతులపై సమీక్షించగా ప్రస్తుతం 136 మంది మాత్రమే మిగిలినట్టు తేలింది. వందలాది విద్యార్థులు కోర్సులో చేరి మధ్యలోనే డ్రాపౌట్ అయ్యారు. ఈ కోర్సు ప్రారంభించే సమయంలో ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి రూ. లక్షలు ఖర్చుచేశాయి. సమావేశాలు, శిక్షణ, వర్క్‌షాప్‌లు, ప్రారంభాల పేరిట నీళ్ల ప్రాయంలా నిధులు ఖర్చుచేశారు. అయితే ఈ కోర్సులో చేరిన విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. డ్రాపౌట్ అయ్యేందుకు గల కారణాలు వివరిస్తున్నారు.
కారణాలివే..
- ఈ కోర్సును పలు యూనివర్సిటీలు గుర్తించడంలేదు. ఉస్మానియా యూనివర్సిటీ ఈ కోర్సును గుర్తించలేదు.
- కొన్ని వర్సిటీల్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడంలేదు. పేపర్ల మూల్యాంకనం, ఫలితాల ప్రకటన వంటి వాటిని పాటించడంలేదు.
- ఎంతో ఆశతో ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు కల్పించడంలేదు.
- ఈ కోర్సు బోధించే టీచర్లకు శిక్షణ ఇవ్వలేదు. ఆన్లైన్ ట్రైనింగ్‌ను వినియోగించుకునే అవకాశం కల్పించలేదు.
- విద్యార్థులకు ఈ కోర్సుపై సరైన సమాచారం కరువైంది. సందేహాలు తీర్చేవారులేక, సమాచారం లేక వర్సిటీలు, ఓయూ గుర్తించనేలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

